Begin typing your search above and press return to search.

చ‌క్రాస‌నంలో ముద్దులిస్తున్న ర‌కుల్!

By:  Tupaki Desk   |   5 March 2020 6:15 AM GMT
చ‌క్రాస‌నంలో ముద్దులిస్తున్న ర‌కుల్!
X
పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎంత పెద్ద ఫిట్ నెస్ ఫ్రీక్ నో చెప్పాల్సిన ప‌నే లేదు. ఎఫ్ 45 పేరుతో జిమ్ము బిజినెస్ లో జోరుగా ఉంది. ఇక వ్య‌క్తిగ‌తంగానూ మంచి ఫిట్ నెస్ ఫ్రీకు. నిత్యం వ‌ర్క‌వుట్ల‌తో సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటుంది. యోగా- ధ్యానం- డ్యాన్సింగ్- జిమ్మింగ్ అంటూ ర‌క‌ర‌కాలుగా సాధ‌న చేస్తుంటుంది. యోగాలో అయితే ర‌క‌ర‌కాలా భంగిమ‌ల్లో వ‌ర్క‌వుట్ల‌ను చేస్తూ వాటి వీడియోల‌ను అభిమానుల‌కు షేర్ చేసి చూడండి నా ర‌చ్చంతా అంటుంది. సొంతంగా హైద‌రాబాద్ లో ఫిటెనెస్ సెంట‌ర్ల‌నే ఓపెన్ చేసింది కాబ‌ట్టి త‌న జిమ్ము గురించి న‌లుగురికి తెలిసేలా ఇలాంటి సాహ‌సాలు చేసి మీడియాలో అటెన్ష‌న్ డ్రా చేస్తుంటుంది. అదే జిమ్ములో యోగాస‌నాలు వేయ‌డం ప‌రిపాటే. స్కిన్ టైట్ దుస్తులు ధ‌రించి వివిధ ర‌కాల భంగిమ‌ల్లో యోగాసన‌లు వేస్తూ యువ‌త‌ను క‌వ్వించే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది.

చేసే ప‌నేదో కామ్ గా కానిచ్చేయ‌దు. న‌లుగురి తెలియాలి...అంద‌రి నోళ్ల‌లో నానాలి అనుకునే టైపు.. అందుకే వ‌ర్క‌వుట్ల‌కు సంబంధించిన వీడియోల‌ను అంద‌రికీ షేర్ చేసి ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా ర‌కుల్ చ‌క్రాసనం వేసి... యోగాస‌నానికే వ‌న్నె తీసుకొచ్చింది. ఎలాగంటారా? అయితే వీడియో ఓసారి చూడాల్సిందే. కాళ్లు చేతులు నేల‌కు ఆన్చి...పొట్ట‌...ఛాతి భాగాన్ని పైకి లేపి విల్లులా వంచి ముఖానికి ఎదురుగా ఉన్నా తెల్ల గొడ‌కు రెండు పెదాలతో ఓ ముద్దు ఇచ్చింది.

త‌న‌కు ట్రైన‌ర్ టిప్స్ చెబుతుంటుంటే ర‌కుల్ అలా చేసి మెప్పించింది. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. స‌న్న‌జాజి సోయ‌గం అలా ప్ర‌యోగాలు చేస్తుంటే ! నెటిజ‌నులు ఊరుకుంటారా? త‌మ‌దైన శైలిలో చెల‌రేగిపోరూ. అదే జ‌రిగింది... యోగా గురువు బాబా రాందేవ్ నే మించిపోయేలా ఉందే అంటూ ర‌కుల్ అస‌నాల‌కు కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంత మంది ర‌కుల్ ఎంతో డెడికేష‌న్.. .క‌మిట్ మెంట్ ఉన్న న‌టి అంటూ కితాబిచ్చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఇండియ‌న్ -2లో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న న‌టిస్తోంది. టాలీవుడ్ లో అవ‌కాశాలు త‌గ్గిన నేప‌థ్యంలో కోలీవుడ్ పైనే ర‌కుల్ పూర్తిగా దృష్టి సారిస్తోంది.