Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లో ఫుల్ బిజీగా టాలీవుడ్ బ్యూటీ..!
By: Tupaki Desk | 10 Oct 2021 7:00 AM ISTఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయికగా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్.. స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకు అందరితో ఆడిపాడింది. అయితే ఇప్పుడు అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు లేవనే అనుకోవాలి. 'మన్మథుడు 2' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ ఏడాది 'చెక్' తో పలకరించింది. లేటెస్టుగా వచ్చిన 'కొండ పొలం' సినిమా కూడా అప్పుడెప్పుడో పూర్తైనదే. దీంతో రకుల్ చేతిలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు. కాకపోతే తమిళ హిందీ భాషల్లో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంటోంది.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా రెండు తమిళ సినిమాలు చేస్తోంది. అలానే హిందీలో నాలుగు ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది. ఇటీవల 'సర్దార్ కా గ్రాండ్ సన్' సినిమాతో అలరించిన రకుల్.. జాన్ అబ్రహం తో కలిసి 'ఎటాక్' అనే సినిమా చేసింది. 2022 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తో 'దే దే ప్యార్ దే' తర్వాత అమ్మడికి మరో రెండు అవకాశాలు అందించారు. అజయ్ దేవగన్ - అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'మే డే'. అజయ్ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసారు.
అలానే అజయ్ దేవగన్ - సిద్దార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'థ్యాంక్ గాడ్' చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఈ బ్యూటీని తీసుకోవడం వెనుక అజయ్ హస్తం ఉందని టాక్ ఉంది. అంతేకాదు 'దే దే ప్యార్ దే' చిత్రానికి సీక్వెల్ చేస్తే రకుల్ ని కూడా కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక 'బెల్ బాటమ్' దర్శకుడితో స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేస్తున్న 'మిషన్ సిండ్రెల్లా' సినిమాలోనూ రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసింది ఇది తెలుగు తమిళ భాషల్లో హిట్ అయిన 'రాక్షసుడు' చిత్రానికి హిందీ రీమేక్.
ఇదే క్రమంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందుతోన్న 'డాక్టర్ జీ' సినిమాలో నటిస్తున్న రకుల్ ప్రీత్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా ఫినిష్ చేసినట్లు 'కొండ పొలం' ప్రమోషన్స్ లో అమ్మడు వెల్లడించింది. హిందీలో నటిస్తున్న నాలుగు సినిమాలు రిలీజ్ అయితే రకుల్ క్రేజ్ మరో స్థాయికి వెళ్లే ఛాన్స్ ఉంది. ఏదేమైనా బక్క చిక్కిపోయిన తర్వాత బాలీవుడ్ లో ఈ బ్యూటీకి మంచి అవకాశాలు వస్తున్నాయని అర్థం అవుతోంది. ఇక మంచి కంటెంట్ తో వస్తే ఓటీటీలో కనిపించడానికి కూడా రెడీ అంటోంది. ఓటీటీ ఆఫర్లు వస్తున్నా కూడా వస్తున్నాయి. ఓటీటీలోకి వస్తే కచ్చితంగా అది పాత్ బ్రేకింగ్ లా ఉండాలని రకుల్ ప్రీత్ సింగ్ చెబుతోంది.
ఇప్పు 'కొండ పొలం' చిత్రంలో పెర్ఫార్మన్స్ చూసి మళ్ళీ తెలుగులో ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ హీరోయిన్ గా చేసింది. ఓబులమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా గొర్రెలు కాసే పాత్రలో అమ్మడు మెప్పించింది. దీని తర్వాత రకుల్ తెలుగులో ఎన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేస్తుందో చూడాలి.