Begin typing your search above and press return to search.

హీరోయిన్ గా రకుల్ ఖాయమైందట

By:  Tupaki Desk   |   21 March 2019 6:25 AM GMT
హీరోయిన్ గా రకుల్ ఖాయమైందట
X
రకుల్ ప్రీత్ సింగ్ కు ఈమధ్య టాలీవుడ్లో పెద్దగా విజయాలు దక్కలేదు. దానికి తోడు తమిళ.. హిందీ చిత్రాలపై ఫోకస్ చేస్తుండడంతో తెలుగులో ఆఫర్లు తగ్గాయి. 'వెంకీమామ' లో మొదట రకుల్ ను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఫైనల్ గా మాత్రం ఛాన్స్ మిస్సయింది. అది మిస్ అయిందేమో కానీ ఇప్పుడు 'మన్మధుడు 2' లో నాగార్జున సరసన హీరోయిన్ గా కన్ఫాం అయిందని సమాచారం.

యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం నాగార్జున కెరీర్లో క్లాసిక్ గా నిలిచిన 'మన్మధుడు' సినిమాకు సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో రకుల్ కోసం బిందాస్ గా ఉండే ఒక ఇంట్రెస్టింగ్ యువతి పాత్రను డిజైన్ చేశాడట రాహుల్. నటనకు మంచి స్కోప్ ఉండే పాత్ర అని.. రకుల్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని టాక్. రకుల్ కూడా ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉందట. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులోనే సినిమాను లాంచ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.

ఇదిలా ఉంటే రకుల్ ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లోనూ ఒక హిందీ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. మెగా హీరో సాయి తేజ్ కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా రాకుల్ పేరును పరిశీలిస్తున్నారని కూడా టాక్ ఉంది.