Begin typing your search above and press return to search.

వైరల్‌ అవుతున్న రకుల్‌ రిక్వెస్ట్‌

By:  Tupaki Desk   |   24 Jan 2022 5:00 PM IST
వైరల్‌ అవుతున్న రకుల్‌ రిక్వెస్ట్‌
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో దాదాపు అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు తో పాటు హిందీ తమిళంలో కూడా నటిస్తోంది. హిందీలో ఈమె చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కమర్షియల్‌ గా హిట్ కాకున్నా కూడా వరుసగా అక్కడ చిన్నా చితకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈఅమ్మడు తెలుగు లో పెద్ద సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. ఈమె నటించిన సినిమాలు ఈ ఏడాదిలో విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. కాని కొత్తగా ఈ అమ్మడికి ఆఫర్లు మాత్రం చిక్కడం లేదు. గత ఏడాది చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు మాత్రం ఆఫర్లు లేక ఎదురు చూస్తున్నట్లుగా గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మీడియాలో వచ్చిన వార్తలు నిజమే అన్నట్లుగా తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. రకుల్‌ ప్రీత్‌ సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తెలుగు తో పాటు తమిళం మరియు హిందీలో మాట్లాడగలను.. పలు భాషల్లో నటించిన అనుభవం ఉంది. కనుక నాకు పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. హీరోయిన్స్ ఇలా అవకాశాలు ఇవ్వమంటూ విజ్ఞప్తి చేయడం కెరీర్‌ ఆరంభంలో చూస్తూ ఉంటాం. కాని రకుల్‌ ప్రీత్‌ సింగ్ కెరీర్‌ ఆరంభించి దాదాపుగా పదేళ్లు కావస్తుంది. ఈ సమయంలో రకుల్‌ అవకాశాల కోసం ఇలా రిక్వెస్ట్‌ పెట్టుకోవడం ఏంటో అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. అది కాకుండా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తనకు పాన్‌ ఇండియా సినిమా ఛాన్స్ లు కావాలంటూ రిక్వెస్ట్‌ చేయడం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

రకుల్‌ ప్రీత్ సింగ్ ఒకానొక సమయంలో మహేష్‌ బాబు తో ఒక సినిమా లో అవకాశం దక్కించుకుని డేట్లు లేకపోవడంతో ఆ సినిమా నుండి తప్పుకుంది. తమిళంలో ఒక స్టార్‌ హీరోకు కూడా డేట్లు లేక పోవడంతో నో చెప్పింది. అంతటి స్టార్ డమ్ ను అనుభవించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు ఇలాంటి రిక్వెస్ట్‌ చేయడం ఏంటి అంటూ సినీ వర్గాల వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో రిక్వెస్ట్‌ లతో అవకాశాలు దక్కడం అరుదుగా జరుగుతుంది. మేకర్స్‌ తమకు అవసరం ఉంటే తప్పకుండా తీసుకుంటారు. అంతే తప్ప ఇలాంటి రిక్వెస్ట్‌ లను కన్సిడర్ చేస్తారా అంటే డౌటే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మొన్నటి వరకు ఆఫర్లు లేవంటూ మీడియాలో కథనాలు వస్తే వారిపై కోపగించుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు తనకు అవకాశాలు ఇవ్వాలంటూ అడగడం చూస్తుంటే కాల చక్రం ఎంత స్పీడ్ గా తిరుగుతుంది కదా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రకుల్‌ లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతు చేస్తూ కెరీర్‌ ను మళ్లీ నిలుపుకునే ప్రయత్నం చేస్తే ఉత్తమం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.