Begin typing your search above and press return to search.

ఇలా అయితే ప‌రేషాను అయ్యేదెలా?

By:  Tupaki Desk   |   13 March 2019 7:00 AM IST
ఇలా అయితే ప‌రేషాను అయ్యేదెలా?
X
సైజ్ జీరో అన‌గానే బెబో క‌రీనా క‌పూర్ గుర్తుకు రావాల్సిందే. బెబో అన్న పేరుకు అంత గుర్తింపు తెచ్చింది ఆ జీరోసైజ్ నే. క‌రీనా అలా జీరో సైజ్ కి మారాక న‌టించిన ప‌లు చిత్రాలు యువ‌త‌రంలో పిచ్చి క్రేజును పంప్ చేశాయి. బికినీ బీచ్ లో బెబో జీరో సైజ్ చూసేందుకైనా థియేట‌ర్ల‌కు వెళ్లేవాళ్లు యువ‌జ‌నం. అంత‌గా పిచ్చి ప‌ట్టించిన ఆ జీరో సైజ్ బెబోకి క‌లిసొచ్చినంత‌గా వేరే ఎవ‌రికీ క‌లిసి రాలేదు. ప‌లువురు భామ‌లు న‌క్క‌ను చూసి వాత‌లు పెట్టుకున్న‌ట్టు జీరో సైజ్ ట్రై చేసినా అంత‌గా సూట్ కాలేదు.

అయితే సైజ్ జీరో భామ‌లకు భిన్నంగా సోనాక్షి సిన్హా, ప‌రిణీతి వంటి భామ‌లు బొద్దందాల ప్ర‌ద‌ర్శ‌న తో మెప్పించారు. అయితే వీళ్లు కూడా ఇత‌ర భామ‌ల‌ ప్ర‌భావంతో సైజ్ త‌గ్గించి జీరోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం ఆస‌క్తి రేకెత్తించింది. ఇప్పుడు సీనియ‌ర్ల బాట‌లో నేను సైతం అంటూ సౌత్ టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ కూడా జీరో సైజ్ కి మారిపోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ర‌కుల్ గ‌త కొంత‌కాలంగా సైజ్ జీరో రూపానికి మారిపోయేందుకు జిమ్ముల్లో క‌ఠోరంగా శ్ర‌మిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు జోరుగానే వైర‌ల్ అయ్యాయి.

తాజాగా ర‌కుల్ జీరోసైజ్ లుక్ కి సంబంధించిన డీటెయిల్డ్ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలోకి వ‌చ్చింది. ర‌కుల్ కూల్ గా బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చింది. ప్ర‌స్తుతం సింగ‌పూర్ వెకేష‌న్ లో ఉన్న ర‌కుల్ ఇలా కూల్ గా చిలౌట్ అవుతోంది. న‌ల్ల రంగు బికినీలో స్విమ్ చేసి సేద దీరేందుకు గ‌ట్టుకు చేరిందిలా. ఈ లుక్ లో మ‌రీ బ‌క్క‌గా క‌నిపిస్తోంది. `ప‌రేషాను అయ్యానురా..`` అంటూ ధృవ సినిమాలో బొద్దుగా క‌నిపించినా ముద్దొచ్చింది. బికినీ బీచ్ వ‌య్యారంతో మైమ‌రిపించింది. ఇప్పుడు ఇలా మారిందేంటి? అంటూ అభిమానులు ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. చ‌క్క‌న‌మ్మ చిక్కితే క‌ష్టం .. కాస్తంత బొద్దెక్కితేనే బావుంటుంది! అంటూ సెటైర్లు వేస్తున్నారు. మ‌రి ర‌కుల్ ఆల‌కిస్తోందా?