Begin typing your search above and press return to search.

రకుల్ కు కుర్రహీరో అయినా హిట్టిస్తాడా!

By:  Tupaki Desk   |   19 Nov 2019 7:00 AM IST
రకుల్ కు కుర్రహీరో అయినా హిట్టిస్తాడా!
X
సౌత్ లో రకుల్ కు ఇప్పుడంతగా హిట్స్ లేవు, అవకాశాలూ బాగా తగ్గుముఖం పట్టాయి. ఒక దశలో స్టార్ హీరోయిన్ గా రాణించిన రకుల్ ఆ తర్వాత క్రమక్రమంగా వెనుకపడిపోయింది. 'మన్మథుడు 2' పై ఆమె చాలా ఆశల పెట్టుకుంది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక రకుల్ కు ఉన్న లక్ ఏమిటంటే.. బాలీవుడ్ లో కూడా కొద్దో గొప్పో గుర్తింపు ఉండటం.

ఇలాంటి క్రమంలో ఆమెకు మరో బాలీవుడ్ సినిమాతో పలకరిస్తోంది. దాని పేరు 'పిక్చర్ షురూ'. సినిమా మొదలైంది అనే అర్థంతో వస్తున్న ఈ సినిమాతో రకుల్ కు మళ్లీ లక్ కలిసి వస్తుందా అనేది ఆసక్తిదాయకంగా మారింది.

ఒకటీ రెండు హిట్స్ తోనే స్టార్ హీరోయిన్ ఎదిగిన ఈ పంజాబీ బ్యూటీ ఇప్పుడు కూడా మరో హిట్ లభిస్తే తన కెరీర్ ఊపందుకుంటుందనే భావనతో కనిపిస్తూ ఉంది.

పిక్చర్ షురూలో ఈమె అర్జున్ కపూర్ తో జత కట్టింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో, ప్రేమకథతో బిజీగా ఉన్నాడు అర్జున్ కపూర్. మరి ఇతడి సినిమాతో రకుల్ కు లక్ కలిసి వస్తుందేమో చూడాల్సి ఉంది.