Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అస్సలు తగ్గని రకుల్!

By:  Tupaki Desk   |   8 May 2019 11:30 AM GMT
ఫోటో స్టొరీ: అస్సలు తగ్గని రకుల్!
X
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ఈమధ్య కాస్త స్లో అయినట్టు అనిపించింది. అయితే హిందీ.. తమిళ సినిమాలపై ఫోకస్ చేయడంతో వచ్చిన గ్యాప్ మాత్రమే అని.. తన రేంజ్ ఏమాత్రం తగ్గలేదని చాటే ప్రయత్నంలో ఉందేమోగానీ వరసబెట్టి ఫోటోషూట్లలో పాల్గొంటోంది. పూటకో ఫోటో షూట్ లో పాల్గొనడం.. ఆ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేయడమే పనిగా పెట్టుకుంది.

తాజాగా మరోసారి విరుచుకుపడింది రకుల్. ఈ సారి బ్లూ కలర్ థీమ్ లో డ్రెస్ వేసుకుంది. స్లీవ్ లెస్ బ్లూ కలర్ టాప్.. వైట్ కలర్ స్ట్రైప్స్ ఉండే బ్లూ కలర్ బెల్ బాటం ప్యాంట్ తో స్టైలిష్ గా నిలబడింది. అదే కలర్ లో ప్రింటెడ్ డిజైన్ ఉన్న షర్టును ఊరికే అలా తన భుజంపై వేసుకుంది. మరో ఫోటోలో అదే షర్టు వేసుకొని క్లోజప్ ఫోటోకు పోజిచ్చింది. బ్రౌన్ షేడ్ లో స్ట్రెయిట్ చేసిన హెయిర్ తో ఒక సూపర్ మోడల్ లాగే కనిపిస్తోంది. రకుల్ డ్రెస్ ను డిజైన్ చేసిన వారు మహిమా మహాజన్. ఈ డ్రెస్ కూడా రకుల్ తాజా చిత్రం 'దే దే ప్యార్ దే' ప్రమోషన్స్ సందర్భంగా ధరించానని తన ఇన్స్టా ఖాతా ద్వారా తెలిపింది. ఫస్ట్ ఫోటోలో రకుల్ స్టైల్ ను చూసినవారెవరైనా ఫిదా కాకుండా ఉండగలరా? ఇక ఆ క్లోజప్ షాట్ లో రకుల్ సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది.

ఈ ఫోటోలను పోస్ట్ చేసి జస్ట్ అరగంట కూడా కాలేదు కానీ అరవై వేల లైక్స్ వచ్చాయి. రకుల్ ను "మోడరన్ బ్యూటీ" అని ఒకరు అంటే.. మరొకరు క్లోజప్ షాట్ నచ్చిందని చెప్పారు. ఏదైతేనేం ఒకటి మాత్రం నిజం. రాకుల్ ఈ ఫోటో షూట్ల దాడి ఇప్పట్లో ఆపేలా లేదు. మీరుకూడా మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోండి. పూటకో డిఫరెంట్ ఫోటో షూట్ ఫోటోలకు రెడీ గా ఉండండి. రకుల్ సినిమాల విషయానికి వస్తే హిందీలో అజయ్ దేవగణ్ చిత్రం 'దే దే ప్యార్ దే' రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తమిళంలో సుర్య 'NGK' కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగులో 'మన్మథుడు 2' లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటిస్తోంది.