Begin typing your search above and press return to search.

రకుల్ కు డబుల్ స్ట్రోక్

By:  Tupaki Desk   |   4 Jun 2019 10:52 AM IST
రకుల్ కు డబుల్ స్ట్రోక్
X
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన వరసబెట్టి ఆఫర్లు కొట్టేసి కొన్నాళ్ళు టాప్ చైర్ లో కూర్చున్న రకుల్ ప్రీత్ సింగ్ కి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. గత రెండేళ్ళుగా పాపం హిట్టు మొహం చూడక పరిస్థితి బ్యాడ్ గా ఉంది. బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నా అక్కడా అంతగా కలిసి రావడం లేదు. ఈ ఏడాది బ్రదర్స్ ఇద్దరు సూర్య కార్తిలతో చెరో సినిమా చేసిన రకుల్ డబుల్ స్ట్రోక్ తినక తప్పలేదు. కార్తితో జోడి కట్టిన దేవ్ అతని కెరీర్ లోనే పీడకలగా చెప్పుకునే సినిమాగా నిలవగా సూర్యతో ట్రై చేసిన ఎన్జికె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఈ రెండూ ఊహించని ఫలితాలే. కాకతాళీయంగా రెండు సినిమాల్లోనూ రకుల్ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే అమ్మాయి పాత్రను పోషించడం గమనార్హం. కాని ఫలితాలు మాత్రం తన కాన్ఫిడెన్స్ ని దెబ్బ తీసేలా రావడం కేవలం విధి లిఖితం. పోనీ హిందిలో వర్క్ అవుట్ చేసుకుందాం అనుకుంటే అక్కడా ఇదే తీరు. గత ఏడాది సిద్దార్థ్ మల్హోత్రాతో నీరజ్ పాండే లాంటి టాలెంటెడ్ దర్శకుడితో చేసిన అయారి బోల్తా కొట్టింది.

సరే పోతే పోయింది సీనియర్ హీరో అయినా పర్వాలేదు అనుకుని అజయ్ దేవగన్ తో చేసిన దే దే ప్యార్ దే కాసిన్ని డబ్బులయితే తెచ్చింది రిజల్ట్ పరంగా చూసుకుంటే ఇదీ ఏమంత గొప్పగా చెప్పుకునే సక్సెస్ కాదు. జస్ట్ యావరేజ్ అంతే. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఫలితాల వల్ల రకుల్ డిఫెన్స్ లో పడిపోయింది. ఈ మధ్య వరస ఫ్లాపులలో ఉన్న శివ కార్తికేయన్ తో చేస్తున్న మూవీతో పాటు నాగార్జునతో ఓకే చేసిన మన్మధుడు 2 మీదే ఆశలన్నీ పెట్టుకుంది. ఇవి హిట్ కొడితేనే ఇంకొన్ని ఆఫర్ల మీద ఆశలు పెట్టుకోవచ్చు.