Begin typing your search above and press return to search.

రకుల్ ఫిట్నెస్ వీడియో.. రచ్చ చేస్తోందిగా!

By:  Tupaki Desk   |   20 April 2019 10:21 PM IST
రకుల్ ఫిట్నెస్ వీడియో.. రచ్చ చేస్తోందిగా!
X
గత జెనరేషన్ హీరోలు.. హీరోయిన్లు ఎంతమంది ఫిట్ గా ఉన్నారు అంటే సమాధానం చెప్పలేం కానీ ఈ జెనరేషన్ లో మాత్రం ఫిట్నెస్ అనేది ఫిలిం సెలబ్రిటీల జీవితంలో ఒక భాగం అయిపోయింది. రకుల్ లాంటి బ్యూటీలు ఎంత ఫిట్నెస్ ఫ్రీక్స్ అంటే.. ఒకరోజు తిండి అయినా మానేస్తారేమో కానీ కసరత్తులకు 'నో' అసలు చెప్పరు. అందుకే వారు ఒంట్లో మిల్లీ గ్రాము కూడా అనవసరమైన ఫ్యాట్ లేకుండా పర్ఫెక్ట్ షేప్ లో ఉండగలుగుతారు.

రకుల్ ఫిట్నెస్ అంటే చెవికోసుకునే రకం కాబట్టే F45 జిమ్ ఫ్రాంచైజీలు కూడా తీసుకుంది. రకుల్ అప్పుడడప్పుడూ తన ఎక్సర్ సైజుల వీడియోలను సోషల్ మీడియా ఖాతా ద్వరా నెటిజనులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రకుల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఎక్సర్ సైజ్ వీడియో షేర్ చేసింది. దీనికి "ఫిట్నెస్ అంటే సన్నగా ఉండడం కాదు. ఆరోగ్యంగా ఉండడం.. మంచి ఎనర్జీతో చురుగ్గా ఉండడం.. శరీరం నుండి టాక్సిన్స్ ను బైటకు పంపడం. అందుకే చెమట పట్టేలా కసరత్తులు చేయండి." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పాటు #త్రో బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. అంటే వీడియో తాజాగా పోస్ట్ చేసింది కానీ కొత్తదు కాదు.. పాతది.

రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే బాలీవుడ్ చిత్రం 'దే దే ప్యార్ దే' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ హీరో. మరో బాలీవుడ్ ఫిలిం 'మర్జావా' లో కూడా నటిస్తోంది. తెలుగులో అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'మన్మథుడు 2' లో హీరోయిన్. తమిళంలో సూర్య 'NGK'.. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా నటిస్తోంది.

Click Here For Video