Begin typing your search above and press return to search.

రకుల్ వీడియో ఎప్పుడు చూపిస్తారో?

By:  Tupaki Desk   |   9 Feb 2018 11:00 PM IST
రకుల్ వీడియో ఎప్పుడు చూపిస్తారో?
X
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటివరకూ చాలా అంటే చాలా జాగ్రత్తగా తన అందాలను పదిలపరచుకుంది. బాలీవుడ్ సినిమా రిలీజ్ అనగానే.. ఒక్కసారిగా రెచ్చిపోయి మరీ మ్యాగ్జిమ్ మేగజైన్ కోసం అందాల ప్రదర్శనను మ్యాగ్జిమమ్ చేసి పారేసిన సంగతి తెలిసిందే.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఈ మ్యాగజైన్ లో రకుల్ ఇచ్చిన పోజులు అన్నీ బికినీ థీమ్ తోనే ఉన్నాయి. ఇప్పటికే ఈ ఫోటోలను చూసి అభిమానులు మైమరచిపోయారు కూడా. కాకపోతే ఫ్యాన్స్ ఓ విషయం కోసం ఎదురుచూస్తున్నారు. సహజంగా అందాల భామలతో ఫోటో షూట్ చేస సమయంలో.. ఫోటోలతో పాటు మేకింగ్ వీడియోలను కూడా రూపొందిస్తారు. కొన్ని ప్రశ్నలతో కూడా ఇంటర్వ్యూ కూడా చేసి.. దాన్ని నెట్ లో పోస్ట్ చేయడం కొంతకాలంగా ఉన్న ఆనవాయితీ. ఇప్పుడు రకుల్ బికినీ ఫోటోలకు సంబంధించిన వీడియో కోసం జనాలు చాలా ఆత్రంగా ఎదురచూసేస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో ఈ ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. రకుల్ పాపకు టాలీవుడ్ లో బోలెడంత క్రేజ్ ఉంది కానీ.. ఇప్పటివరకూ బికినీ అందాలను చూపించలేదు. గ్లామర్ హీరోయిన్ అయినా.. బికినీలో ఈ భామ దర్శనం మాత్రం ఇప్పటివరకూ కాలేదు. ఇప్పుడు మాగ్జిమ్ విడుదల చేయబోయే మేకింగ్ వీడియోలో రకుల్ ప్రీత్ ను బికినీలో చూసి.. సొగసులను ఆస్వాదించేయాలని ఫిక్స్ అయిపోయిన ఫ్యాన్స్.. తెగ వెయిటింగ్ చేసేస్తున్నారు.