Begin typing your search above and press return to search.

నిత్య మీనన్‌ తో రకుల్‌ పోటీ!!

By:  Tupaki Desk   |   15 Sept 2015 7:00 AM IST
నిత్య మీనన్‌ తో రకుల్‌ పోటీ!!
X
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ యమా స్పీడ్ గా ఉంది. పెద్ద ఛాన్సులు పట్టడంలోనే కాదు మిగిలిన విషయాల్లో అమ్మడి జోరు బాగా కనిపిస్తోంది. ఈ మధ్య ఎక్కడ కనిపించినా తెలుగులోనే మాట్లాడేస్తోంది పంజాబీ భామ. మైకు దొరికితే చాలు తెలుగులోనే అదరగొడుతోంది.

ఇంటర్వ్యూ లు కూడా తెలుగులో ఇచ్చేస్తూ.. తనకు టాలీవుడ్ ఎంత ముఖ్యమైన ఇండస్ట్రీయో చెప్పకనే చెబ్తోంది. అదికూడా అరువు తెచ్చుకున్న తెలుగులా కాకుండా.. స్వచ్ఛంగానే మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా నేర్చుకున్న తెలుగుతో.. తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోవాలన్నది రకుల్ కోరిక. ఇప్పటివరకూ ఎవరూ రకుల్ కి డబ్బింగ్ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ అల్లు అర్జున్ తో కలిసి నటిస్తున్న మూవీలో.. రకుల్ తోనే డబ్బింగ్ చెప్పించాలని భావిస్తున్నారట టీం.

ఇకపోతే ప్రస్తుతం ఉన్న భామల్లో.. సమంత - తమన్నాలు డబ్బింగ్‌ కోసం ట్రై చేసి విరమించుకున్నారు. అలాగే కాజల్‌ కూడా. అప్పట్లో త్రిష - అనుష్క ఏదో చేద్దాం అనుకున్నారు కాని, వర్కవుట్‌ కాలేదు. ఇక నిత్య మీనన్‌ ఒక్కత్తే సొంత డబ్బింగ్‌ తో ఉతికి ఆరేసింది. మరి రకుల్‌ డబ్బింగ్‌ ఆమెను తలపిస్తుందా? పోటీ పడుతుందా? చూద్దాం!!