Begin typing your search above and press return to search.

అప్పుడు మాత్రమే అలసిపోతుందట

By:  Tupaki Desk   |   12 April 2016 10:19 AM IST
అప్పుడు మాత్రమే అలసిపోతుందట
X
కుర్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. బాగా యాక్టివ్. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోను బాగా హుషారుగా ఉండటం రకుల్ కి అలవాటు. సెట్లో ఈ భామ దూకుడు చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. అసలు కొంచెం కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేసేందుకు ఏ మాత్రం సంకోచించదు రకుల్ ప్రీత్.

రకుల్ తో సినిమా చేసిన వాళ్లు.. ఈ బ్యూటీలో ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువ అంటారు రోజంతా షూటింగ్‌ లో పాల్గొన్నా.. ఏ మాత్రం అలసిపోదట. ఈ విషయాన్ని రకుల్‌ కూడా ఒప్పుకుంటోంది. ‘నీరసంగా కూర్చోవడం అంటే నాకు మహా చిరాకు. చేతిలో పని లేకపోతేనే అలసిపోయినట్లు అనిపిస్తుంది. ప్రతి క్షణం కెమెరా ముందే ఉండాలన్నది నా కోరిక. బహుశా ఇది నాకు బాగా ఇష్టమైన పని కావడంతో.. షూటింగ్ పై ఇంత ప్రేమ చూపిస్తానేమో’ అంటోంది రకుల్.

షూటింగ్‌ లేకపోతే రకుల్ కనీసం నిద్ర కూడా రాదట. రోజుకి నాలుగు గంటలు మాత్రమే పడుకొంటానని.. ఇంకో గంట పెరిగితే బాగా నిద్రపోయినట్టేనని అంటోంది. పెద్దగా ఫెసిలిటీస్ లేకపోయినా.. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతానని చెప్పస్తోంది. ప్రస్తుతం బన్నీకి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘సరైనోడు’ ఈనెల 22న ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది.