Begin typing your search above and press return to search.

రకుల్ ఏం తొక్కుతోందో...

By:  Tupaki Desk   |   25 Jun 2016 4:15 AM GMT
రకుల్ ఏం తొక్కుతోందో...
X
గత రెండు రోజులుగా రామ్ చరణ్.. రకుల్ ప్రీత్ సింగ్ లు సోషల్ నెట్వర్కింగ్ లో చేస్తున్న పోస్టులు చూస్తే.. వీళ్లిద్దరూ కశ్మీర్ ఎందుకెళ్లారబ్బా అనిపించక మానదు. వీళ్లు అక్కడికెళ్లింది ధృవ సినిమా షూటింగ్ కోసమే అయినా.. కశ్మీర్ అందాలను టూరిస్టుల కంటే ఎక్కువగా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఫోటోలు తీస్తున్నారు.. వీడియోలు తీస్తున్నారు.. తమ ఆనందాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేసేస్తున్నారు.

ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ ఓ వీడియో పోస్ట్ చేసింది. కశ్మీర్ కొండలపైన రకుల్ సైకిల్ తొక్కేస్తోంది. అది కూడా ఫుల్లు స్పీడుగా. కారుతో సమానంగా రకుల్ సైకిల్ తొక్కుతోందో.. రకుల్ తొక్కే స్పీడుతో కార్ డ్రైవ్ చేస్తున్నారో అంత తేలిగ్గా చెప్పలేం కానీ.. అమ్మడు మాత్రం చాలా స్పీడ్ గానే సైకిల్ తొక్కేస్తోంది. 'ఇప్పుడు నా అడ్వంచర్ రైడ్ గురించి చూద్దాం.. ఎంత ఎత్తులోనో తెలుసా' అంటూ పోస్ట్ కూడా పెట్టింది.

రామ్ చరణ్ తో చేస్తున్న మూవీ షూటింగ్ అప్ డేట్స్ తో పాటు.. ఇటు కశ్మీర్ టూర్ ని ఫుల్లుగా చేసేస్తోంది రకుల్ ప్రీత్. అటు చరణ్ కూడా ఏం తక్కువ కాదు. రకుల్ తో యాంకరింగ్ చేయించి.. వీడియోలు నెట్ లో పెట్టేస్తున్నాడు. మొత్తానికి ఈ బ్రూస్ లీ కపుల్.. వరుసగా రెండో సినిమా చేస్తుండడంతో బాగా కెమిస్ట్రీ కుదిరినట్లుంది. అందుకే సందడి పెరిగిపోయింది.