Begin typing your search above and press return to search.
అంత బిజీ అయితే ఇలా ఎందుకో మరి?
By: Tupaki Desk | 26 Nov 2018 11:19 AM ISTతెలుగు సినిమా పరిశ్రమలో గత ఏడాది, అంతకు ముందు ఏడాది వరుసగా స్టార్ హీరోలతో సినిమాల్లో నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రకుల్ పేరు దక్కించుకుంది. కాని ఈ సంవత్సరం ఆమెకు తెలుగులో చాలా తక్కువ ఆఫర్లు దక్కాయి. ఇక ఏడాది చివర్లో ఆమెను పలకరించిన వారే కరువయ్యారు. తెలుగులో అవకాశాలు లేవని ఆమెపై జాలి చూపుతున్న ప్రేక్షకులకు - మీడియా వారికి షాక్ ఇచ్చేలా తాను చాలా బిజీగా ఉన్నానని - ఏకంగా ఎనిమిది సినిమాలు ప్రస్తుతం తన చేతిలో ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. తాను ఖాళీగా ఉన్నానంటూ - అవకాశాలు లేవంటూ వచ్చిన కథనాలను అవహేళన చేస్తూ తాజాగా మాట్లాడినది.
రకుల్ తెలుగులో అవకాశాలు లేకున్నా తమిళంలో పెద్ద సినిమాలు చేస్తున్నానంటూ మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తెలుగులో వచ్చిన అవకాశాలను డేట్లు లేకపోవడం వల్ల వదులుకున్నాను అంటూ చెప్పుకొస్తుంది. అయితే రకుల్ చెప్పేవన్నీ కూడా తనకు తాను హైప్ క్రియేట్ చేసుకునేందుకు చెప్పే మాటలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం కూడా చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజీల్లో హాట్ ఫొటో షూట్స్ ఫొటోలతో నింపేస్తోంది. అంత బిజీగా ఉన్న హీరోయిన్ ఇంత హాట్ ఫొటోలకు ఫోజ్ లు ఇవ్వాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా బిజీగా ఉన్నప్పుడు ఇలా హాట్ ఫొటోలకు ఫోజ్ లు ఇస్తూ కష్టపడటం ఎందుకో అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
వరుసగా వారంలో రెండు మూడు రోజులు ఏదో ఒక మ్యాగజైన్ కు లేదంటే మరే ప్రచారానికైనా హాట్ ఫొటో షూట్ ఇస్తూనే ఉంది రకుల్. అందుకే రకుల్ అవకాశాల కోసం ఇలా చేస్తుందని వాదించేవారు లేకపోలేదు. ప్రస్తుతం చేస్తున్న చిన్నా చితక చిత్రాలు వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రకుల్ పరిస్థితిపై ఫుల్ క్లారిటీ వస్తుంది.