Begin typing your search above and press return to search.

ప‌గ‌వాడికైనా రాకూడ‌ని క‌ష్టం!

By:  Tupaki Desk   |   14 Sept 2018 10:23 AM IST
ప‌గ‌వాడికైనా రాకూడ‌ని క‌ష్టం!
X
సైజ్ జీరో కోసం నానా పాట్లు ప‌డుతున్నారు క‌థానాయిక‌లు. స‌న్న‌జాజి న‌డుము కోసం.. మెరుపుతీగ రూపం కోసం తిండి క‌ట్టేసి జిమ్ముల్లో గంట‌ల కొద్దీ వ్యాయామం చేస్తున్నారు. ఈ క‌ష్టం ప‌గ‌వాడికి - మ‌గ‌వాడికి కూడా రాకూడ‌దు దేవుడా! అనుకునే రేంజులో ఉంది శ్ర‌మ‌. అటు బాలీవుడ్ నాయిక‌ల స్ఫూర్తితో ఇటు సౌత్ నాయిక‌లు సైతం ఫిట్‌ నెస్‌ విష‌యంలో ఏమాత్రం అశ్ర‌ద్ధ చేయ‌డం లేదు. క‌స‌ర‌త్తుల‌తోనే అందం - ఆరోగ్యం అని ఫిక్స‌యిపోయారు. ఇదిగో ఇక్క‌డ జిమ్ చేస్తున్న ర‌కుల్ క‌ష్టం చూశారా? చ‌క్క‌న‌మ్మ ఎంత హార్డ్‌ గా జిమ్ చేస్తోందో?

ఇటీవ‌లే జిమ్ బిజినెస్ ప్రారంభించి ఒక పెద్ద చైన్‌ నే ర‌న్ చేస్తోంది. దేశ‌వ్యాప్తంగా ఫిట్‌ నెస్ జిమ్ముల్ని ప్రారంభిస్తూ ఎంట‌ర్‌ ప్రెన్యూర్‌ గా హ‌వా సాగిస్తోంది. జిమ్ బిజినెస్ ప్రారంభిస్తే స‌రిపోతుందా.. దానిని ప్ర‌మోట్ చేయాలంటే త‌ను కూడా ఫిట్‌ గా క‌నిపించాలి. అందుకోసం ఎంతో క‌ఠోరంగా శ్ర‌మించాల్సి ఉంటుంది. అందుకే ఇదిగో ఇలా సెల‌బ్రిటీ ఫిట్‌ నెస్ ట్రైన‌ర్ మిస్ట‌ర్ హారిస‌న్ జేమ్స్ శిక్ష‌ణ‌లో రాటుదేలుతోంది.

ఇదో ర‌కం టైర్ జిమ్‌. ఇందులో టైర్ల‌తోనే కుస్తీలు ప‌ట్టాలి. శ్ర‌మకు త‌గ్గ‌ట్టే గుడ్ రిజ‌ల్ట్‌ నిచ్చే ఎక్స‌ర్‌ సైజులు చేయిస్తారు. మ‌రీ అంత హెవీ వెయిట్స్ ఎత్తాల్సిన ప‌నేలేకుండా ఇలా టైర్ల‌ను ఎత్తేస్తూ ర‌కుల్ చేస్తున్న ఎక్స‌ర్‌ సైజులు కాస్తంత కొత్త‌గానే కనిపిస్తున్నాయి. ర‌కుల్ స్వ‌యంగా ఈ వీడియోల్ని ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో షేర్ చేయ‌డంతో అభిమానుల నుంచి కామెంట్లు అదే రేంజులో ప‌డుతున్నాయ్‌. ఏవ‌మ్మోవ్‌.. అవేం ఎక్స‌ర్‌ సైజులు.. ఇంత‌కంటే గొప్ప ఎక్స‌ర్‌ సైజులు లేవా అంటూ కొంద‌రు... ఇదేదో పూర్తిగా డిఫ‌రెంట్ ఎజెండా! అంటూ మ‌రికొంద‌రు ఆట‌ప‌ట్టించారు! ఇంత‌కీ అదే టైర్ల కంపెనీ అంటూ సెటైర్ వేశాడో ప్ర‌బుద్ధుడు. మొత్తానికి ర‌కుల్ క‌ష్టం మామూలుగా లేదు. ప్ర‌స్తుతం ఈ భామ `ఎన్టీఆర్‌` చిత్రంలో శ్రీ‌దేవి పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి