Begin typing your search above and press return to search.

'మమ్మీ'లా మారిన రకుల్

By:  Tupaki Desk   |   25 April 2017 8:01 AM GMT
మమ్మీలా మారిన రకుల్
X
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మమ్మీలా మారిపోయింది. అలా మారిపోయి ఫోటో దిగింది కూడా. యంగ్ హీరోయిన్ రకుల్ మమ్మీ ఏంటి అనే కరెక్టే కానీ.. ఇక్కడ మమ్మీ అంటే అమ్మ కాదు. హాలీవుడ్ మూవీ మమ్మీ చూశారు కదా.. అందులో మమ్మీలు ఎలా ఉంటాయో తెలుసు కదా.

అలా ఒళ్లంతా తెల్లటి క్లాత్ చుట్టేసుకుని.. కనీసం ఫేస్ లో ఒక సెంటీమీటర్ పార్ట్ కూడా బైటకు కనిపించకుండా కప్పేసుకుంది రకుల్. ఇదంతా ఇప్పటి ఎండల ప్రభావంతోనే అని చెప్పింది రకుల్ ప్రీత్. వైట్ క్లాత్ తో ఫేస్ అంతా కవర్ చేసేసి.. సన్ గ్లాసెస్ ధరించి.. ఫోటో దిగి నెట్ లో పెట్టిన రకుల్.. 'సమ్మర్ లో నది ఒడ్డున 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ చేసేటపుడు ఇలా ఎండల నుంచి కాపాడుకోవాలి' అంటోంది రకుల్. రేపల్లిలో షూటింగ్ చేస్తున్నట్లు చెప్పిన రకుల్ ప్రీత్.. ఏ సినిమా అనే విషయం అయితే చెప్పలేదు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించే సినిమా.. ఈ ప్రాంతంలో జరుగుతోందని తెలుస్తోంది.

రీసెంట్ గా ఈ భామ మహేష్ బాబు స్పైడర్ మూవీ షూట్ లో కూడా పాల్గొంది. ఆ సినిమాకి సంబంధించి ఓ షూటింగ్ స్పాట్ పిక్ ను కూడా షేర్ చేసిన రకుల్.. ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో తెగ బిజీగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/