Begin typing your search above and press return to search.

యోగంతోనే భోగం.. ర‌కుల్ టీచ‌ర్‌

By:  Tupaki Desk   |   22 Aug 2018 10:40 AM IST
యోగంతోనే భోగం.. ర‌కుల్ టీచ‌ర్‌
X
మనిషి మనసు చంచల స్వభావం కలది. ఈ చంచలత్వాన్ని తగ్గించడం కోసం మునులు చెప్పిన ఉపాయమే యోగం. అసలు విషయాన్ని మరచి మ‌నిషి భోగం వైపు వెళుతున్నాడు. దానినుంచి కాన్‌స‌న్‌ట్రేష‌న్ వైపు మ‌ర‌లాలి. ఇదంతా ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వ‌స్తోంది? అంటే.. గ‌త కొంత‌కాలంగా ర‌కుల్ ప్రీత్ మ‌న‌సు మ‌న‌సులా లేదు. `స్పైడ‌ర్` ప‌రాజ‌యం త‌ర్వాత ఈ అమ్మ‌డికి అన్నీ ఊహించ‌ని ప‌రిణామాలే. అటు బాలీవుడ్ కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. ఇటు టాలీవుడ్‌ లోనూ ఊహించ‌ని రీతిలో అతిధి పాత్ర‌లో - లేక ప‌రిమితంగా క‌నిపించేవో త‌ప్ప వేరే అవ‌కాశాల్లేవ్‌. ధ్రువ లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ లేక‌పోతే ర‌కుల్ స‌న్నివేశం పూర్తిగా ఇంకోలా ఉండేదేమో!

అందుకే ఎక్క‌డో త‌న కార్య‌సాధ‌న డిస్ట్ర‌బ్ అవుతోంద‌ని భావించి ఇదిగో ఇలా యోగ‌సాధ‌న‌లో నిష్ఠ‌గా ఉంది. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో యోగ‌సాధ‌న చేయ‌డం ద్వారా తిరిగి త‌న దృష్టి కేవ‌లం ప‌ని మీద‌నే మ‌ర‌ల్చే ప్ర‌య‌త్న‌మే ఇది. ఈ పాఠం కేవ‌లం ర‌కుల్‌కి మాత్ర‌మే కాదు, లైఫ్‌ లో డిస్ట్ర‌బ్ అయిన అంద‌రికీ వ‌ర్తిస్తుంది. చంచ‌ల స్వ‌భావాన్ని అరిక‌ట్టి - చేసే ప‌నిపైనే దృష్టి పెట్టాలంటే యోగా ఎంతో అవ‌స‌రం అని చెప్ప‌క‌నే చెబుతోందిలా.

ర‌కుల్ ప్ర‌స్తుతం తెలుగులో `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌లో శ్రీ‌దేవి పాత్ర‌లో న‌టిస్తోంది. ఇది కొన్ని నిమిషాల ప‌టు వ‌చ్చి వెళ్లేదే. ఇక‌పోతే త‌మిళంలో కార్తీ సినిమాలో - సూర్య ఎన్‌ జీకేలోనూ న‌టిస్తోంది. అక్క‌డ సెకండ్ లీడ్ త‌ర‌హా పాత్ర‌లే. అందుకే పూర్తిగా సినీలోకం దృష్టి త‌న‌వైపు మ‌ర‌లించే ప్ర‌య‌త్నంలో సీరియ‌స్‌గానే ఉంది. యోగంతోనే భోగం!