Begin typing your search above and press return to search.

రకుల్‌ ప్రీత్‌ బాగా గడుసు పిల్లే!!

By:  Tupaki Desk   |   18 Oct 2015 9:48 AM IST
రకుల్‌ ప్రీత్‌ బాగా గడుసు పిల్లే!!
X
సెక్సీ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌. అమ్మడు బ్రూస్‌ లీ సినిమాలో సన్నని మెరుపుతీగలాగా అలరించేసింది. తన అందచందాలతో వెండితెరను తడిపేసి ప్రేక్షకులను ముగ్ధమనోహరులను చేసిపాడేసింది. నటపరంగా ప్టాస్టిక్‌ యాక్టింగ్‌ టైపులోనే అనిపించినా.. ఘాటైన అందాలను నాటుగా ఆరబోయడంలో మాత్రం ఆరితేరిందని అర్ధమైపోయిందిలే.

ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు బ్రూస్‌ లీ సినిమాను మరింత ప్రమోట్‌ చేసేందుకు అమ్మడు ట్విట్టర్‌ లో నానా రచ్చా చేస్తోంది. అభిమానులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నడుపుతోంది. అయితే ఈ ట్వీట్‌ సెషన్ లలో యవకులు ఆగుతారా.. యథావిథిగా రెచ్చిపోయారు. ఐ లవ్‌ యూ అంటూ కొందరు.. నువ్వు ఎలాంటి పర్సన్‌ తో డేటింగ్‌ చేస్తావ్‌ అంటూ కొందరు నానా హంగామా చేశారు. వాళ్ళలో ఒకతను అడిగిన ప్రశ్నకు అమ్మడు ఇచ్చిన ఆన్సర్‌ వింటే మనకు గింగిరాలు తిరగాల్సిందే.

'నాకు నువ్వు ఎప్పుడూ రాత్రుళ్ళే కలల్లోకి వస్తుంటావ్‌ ఎందుకని?' అంటూ ఒక ఫాలోవర్‌ ప్రశ్నను సంధించాడు. వెంటనే జవాబిచ్చిన రకుల్‌.. ''అవును.. నేను రోజంతా షూటింగ్‌ లో బిజీగా ఉంటాను కదా.. అందుకే రాత్రుళ్లే కలల్లోకి వస్తా'' అని టక్కున చెప్పేసింది. అమ్మ రకుల్‌.. గడుసరి పిల్లవే!!