Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ తో రకుల్‌ కు వింత కష్టాలు

By:  Tupaki Desk   |   27 April 2020 12:31 PM IST
లాక్‌ డౌన్‌ తో రకుల్‌ కు వింత కష్టాలు
X
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే. దీంతో సినిమా పరిశ్రమ పూర్తిగా స్థంభించి పోయింది. సినీ కార్మికుల నుండి స్టార్స్‌ వరకు కూడా చాలా మంది నష్టపోతున్నారు. సినిమాలు షూటింగ్‌ లేకపోవడంతో పాటు సినిమాలు విడుదల లేక పోవడం వల్ల సినిమాకు చెందిన అన్ని వర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమయంలో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇతర హీరోయిన్స్‌ తో పోల్చితే ఎక్కువగా నష్టపోతుంది. ఆమెపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

రకుల్‌ కు గత ఏడాది కాలంగా సినిమాల్లో పెద్దగా ఆఫర్లు లేవు. ఛాన్స్‌ ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో లాక్‌ డౌన్‌ షూటింగ్స్‌ ఆగిపోవడంతో పాటు భవిష్యత్తులో సినిమాల మేకింగ్‌ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. దాంతో రకుల్‌ మళ్లీ హీరోయిన్‌ గా బిజీ అవ్వడం దాదాపుగా అసాధ్యం అనిపిస్తుంది. ఇక హీరోయిన్‌ గానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రకుల్‌ నష్టపోతుంది. రకుల్‌ కు హైదరాబాద్‌ వైజాగ్‌ ల్లో జిమ్‌ సెంటర్స్‌ ఉన్న విషయం తెల్సిందే.

హైదరాబాద్‌ లో రెండు వైజాగ్‌ లో ఒకటి జిమ్‌ సెంటర్‌ ను రకుల్‌ నిర్వహిస్తుంది. లాక్‌ డౌన్‌ కు ముందు అంతా బాగానే ఉండేది. ఇప్పుడిప్పుడే లాభాల్లో పడుతున్నామనుకుంటున్న సమయంలో గత నెలన్నర రోజులుగా పూర్తిగా జిమ్‌ సెంటర్‌ మూసి వేయాల్సిన పరిస్థితి. మరో రెండు మూడు నెలల వరకు కూడా ఓపెన్‌ అయ్యేనో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక ఆ జిమ్‌ సెంటర్‌ ల మెయింటెన్స్‌ మరియు అందులో ఉద్యోగులకు జీతాలు నెలకు లక్షల్లో తన సొంతంగా ఇవ్వాల్సి వస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆమె మరింతగా ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు అంటూ అంటున్నారు. జిమ్‌ సెంటర్‌ సాగక పోవడంతో మెయింటెన్స్‌ తగ్గించేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తుందని సమాచారం.