Begin typing your search above and press return to search.
మాస్కుతో బ్యూటీ మెడిసిన్స్ కొనుగోలు
By: Tupaki Desk | 6 May 2020 7:44 PM ISTరకుల్ ప్రీత్ సింగ్ గురించి ఇంట్రో ఇవ్వాల్సిన పనేలేదు. ఈమధ్య టాలీవుడ్ లో కెరీర్ కొంచెం స్లో అయింది కానీ రెండేళ్ళ క్రితం వరకూ టాప్ హీరోల సినిమాల్లో నటిస్తూ దుమ్ము దులిపేసింది. రకుల్ ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ పైనే దృష్టి సారించింది. లాక్ డౌన్ సమయంలో కూడా అక్కడే ఉంది. రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్ కాబట్టి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. ఇలా స్వయంగా ఇచ్చే అప్డేట్లతో పాటుగా ముంబైలో బైటకు సెలబ్రిటీలు వస్తే చాలు వెంటనే ఫోటోలు తీస్తారు కదా.. అలా తాజాగా ఒక వీడియో తీసి ఇన్స్టాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది.
ఈ వీడియోలో రకుల్ బాంద్రా ఏరియాలోని ఒక మెడికల్ షాప్ లో ఏవో మందులు కొనుగోలు చేసి నడుచుకుంటూ బైటకు వచ్చింది. అయితే మొహానికి మాస్క్ ధరించి ఉండడంతో టక్కుమని కనిపెట్టడం కష్టం. చివర్లో వీడియో అవసరమా అన్నట్టుగా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ వీడియోలో రకుల్ ఓ లైట్ కలర్ టీ షర్టు.. బ్లాక్ స్పోర్ట్స్ ప్యాంట్ ధరించి పోనీ టెయిల్ తో ఎంతో క్యాజువల్ గా కనిపిస్తోంది. ఎంత మాస్క్ వేసుకున్నా రకుల్ ను భలే కనుక్కున్నారు కదా?
ఇక ఈ భామ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే హిందీలో 'ఛలే ఛలో'..'థ్యాంక్ గాడ్'.. 'ఎటాక్'అనే సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో చంద్రశేఖర్ యేలేటి-నితిన్ సినిమాలో నటిస్తోంది. తమిళంలో 'ఇండియన్ 2'.. 'అయాలన్' సినిమాల్లో నటిస్తోంది.