Begin typing your search above and press return to search.

మీసాల హీరోయిన్లను చూశారా?

By:  Tupaki Desk   |   30 Nov 2017 12:16 PM IST
మీసాల హీరోయిన్లను చూశారా?
X
అమ్మాయిలన్నాక అలకలు చాలా కామన్. ఇది జగమేరిగిన సత్యం. ఎంత సైలెంట్ గా ఉన్న అమ్మాయి అయినా అలిగే లక్షణం ఉండకుండా ఉండదని చాలా మందికి తెలుసు. అయినా అమ్మాయిలకు అది కూడా అందంలో ఒక భాగమేనని చెప్పవచ్చు. లేకుంటే మగవారి నుంచి కవితలు కరువవుతాయి కదా! ఇక అసలు విషయానికి వస్తే.. హీరోయిన్స్ మధ్య కొన్ని రోజులకే అలకలు చాలా వస్తాయని ఒక టాక్ బాగా ఉంది.

హీరోలు ఉన్నంత క్లోజ్ గా హీరోయిన్స్ ఉండరనే కామెంట్స్ ఇప్పటికి ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలలో వినబడుతుంటాయి. కానీ టాలీవుడ్ లో మాత్రం కొన్ని రోజుల తర్వాత ఆ టాక్ ఉండదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన హీరోయిన్స్ మధ్య సాన్నిహిత్యాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ - రాశి ఖన్నా ల మధ్య స్నేహాన్ని చూస్తుంటే కూడా ఈ మధ్య నెటీజన్స్ కి అదే అనుభూతి కలుగుతోంది.

ముద్దుగుమ్మలిద్దరూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ రోజు రాశిఖన్నా పుట్టిన రోజు కావడంతో రకుల్ ఒక స్పెషల్ ఫొటో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది. ఇద్దరు మీసాలతో అల్లరిగా దిగిన ఆ ఫొటో ప్రస్తుతం వారి అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది. నిజంగా వీరిని చూస్తుంటే తెలుగు హీరోయిన్స్ మధ్య అలకలు ఈర్షలు ఏమి లేవని అనిపోస్తోంది కదా.