Begin typing your search above and press return to search.

రకుల్‌ ప్రీత్‌ ఎంత మంచిదండీ...

By:  Tupaki Desk   |   12 May 2016 10:58 AM IST
రకుల్‌ ప్రీత్‌ ఎంత మంచిదండీ...
X
చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఒక ఆడియో ఫంక్షన్‌ కు గెస్టుగా వచ్చినా కూడా.. మాకెంత ఇస్తారు అని అడిగే హీరోయిన్లు ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఒక తమిళ డబ్బింగ్‌ తెలుగు సినిమా ఆడియో లాంచ్‌ కు తమన్నాను రమన్నాడు నిర్మాత. ఆ సినిమాలో తమన్నాయే హీరోయిన్‌ కూడా. అయినాసరే తెలుగు వర్షన్‌ ఆడియో లాంచ్‌ కు రావాలంటే.. ముంబయ్‌ నుండి ఫస్టు క్లాస్‌ ఎయిర్ టిక్కెట్లతో పాటు.. తనకు 10 లక్షల ఫీజు కూడా కావాలని అమ్మడు డిమాండ్‌ చేసింది. అజిత్‌-తమన్నా ''వీరం'' సినిమాకు ఈ హంగామా జరిగిందిలే.

కాని ఇప్పుడున్న హీరోయిన్లలో రకుల్‌ ప్రీత్‌ సింగ్ స్టయిలే వేరు. తనకు ఫీజు కాదు కదా.. కనీసం కారు పెట్రోల్‌ ఖర్చు ఇవ్వమని కూడా ఎవ్వరినీ అడగట్లేదు అమ్మడు. నిన్నటికి నిన్న విశాల్‌ ''రాయుడు'' సినిమా ఆడియో లాంచ్‌ కు విచ్చేసింది. ఎందుకటే అమ్మడు విశాల్‌ తదుపరి సినిమాలో అతగాడి హీరోయిన్‌ గా చేస్తోంది కాబట్టి.. పిలువగానే వచ్చేసిందట. ఇక చాలా తెలుగు సినిమాల ఆడియో లాంచ్‌ లకు గతంలో అలాగే విచ్చేసింది రకుల్‌. పైగా అమ్మడు ఉండేది హైదరాబాద్‌ లో నే కాబట్టి.. ప్లయిట్‌ టిక్కెట్లు వంటివి కూడా డిమాండ్‌ చేయట్లేదు. ఎంత గొప్ప మనస్సో!!

అందుకే చాలామంది స్టార్లు రకుల్‌ ను తీసుకోవడానికి తెగ ఇష్టపడేది. కమర్షియల్‌ హీరోయినే కాని.. మరీ టూ మచ్‌ కమర్షియల్‌ కాదు.