Begin typing your search above and press return to search.

రకుల్ కష్టం ఏమవుతుందో మరి

By:  Tupaki Desk   |   8 Jan 2018 4:55 PM IST
రకుల్ కష్టం ఏమవుతుందో మరి
X
టాలీవుడ్ బెస్ట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మొన్నటి వరకు కెరీర్ ను బాగానే నెట్టుకొచ్చింది. కానీ ఇటీవల అమ్మడికి అపజయాలు ఎక్కువగా అందుతున్నాయి. టాలీవుడ్ లో టాప్ వన్ లో ఉన్న రకుల్ ప్రస్తుతం డౌన్ అయ్యింది అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. కానీ రకుల్ మాత్రం మంచి అవగాహనతో కెరీర్ ను చక్కగా బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. రిజల్ట్ ఎలా ఉన్నా అందంతో అందరిని మాయ చేస్తోంది.

ముఖ్యంగా అమ్మడు బాలీవుడ్ లో ఎలాగైనా నిలదొక్కుకోవాలని ఇప్పుడు ప్రయత్నాలను చాలా గట్టిగా చేస్తోంది. తాను నటించిన అయ్యారి సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతోంది. ఆ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నాడు. అంతే కాకుండా విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. అయితే సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ విషయంలో రకుల్ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. ఎవరు వస్తున్నా రాకపోతున్నా కూడా అయ్యారి ప్రమోషన్స్ లో పాల్గొంటోంది.

అంతే కాకుండా చాలా వినూత్నమైన డ్రెస్సింగ్ స్టైల్ థాయ్ కెమెరాలను తనవైపు తిప్పుకుంటోంది. దీంతో ఆ ఫొటోలు నెట్ లో దర్శనం ఇవ్వడంతో నెటిజన్స్ చూపుతిప్పుకోనివ్వడం లేదు. టాలీవుడ్ లో అమ్మడు ఎన్ని గ్లామర్ డ్రెస్ లో కనిపించినా ఎప్పుడు ఇంత సెక్సీ అందాలతో హీటెక్కించలేదు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా రకుల్ అయితే చాలా కష్టపడుతోంది మరి ఆ సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి. ఈ గ్లామర్ ప్రమోషన్లకు ప్రతిఫలం జనవరి 26న అయ్యారి రిలీజైనప్పుడు తెలుస్తుందిలే.