Begin typing your search above and press return to search.

చక్కనమ్మ ఎందుకు చిక్కింది

By:  Tupaki Desk   |   5 Jan 2018 11:18 AM IST
చక్కనమ్మ ఎందుకు చిక్కింది
X
టాలీవుడ్ స్వీట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఎంట్రీ స్పెషల్ గా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సిద్దార్థ్ మల్హోత్రా సరసన తను నటించిన కొత్త సినిమా 'అయారి' ప్రమోషన్ కోసం ఢిల్లీలో ఉన్న రకుల్ దీని మీద చాలా హోప్స్ పెట్టుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో మంచి పేరున్న నీరజ్ పాండే దీనికి దర్శకత్వం వహించడం వల్ల హైప్ బాగానే క్యారీ అవుతోంది. అక్షయ్ కుమార్ ప్యాడ్ మ్యాన్ తో సైతం పోటీకి సిద్ధపడింది. ఈ సంక్రాంతికి రాబోతున్న సూర్య గ్యాంగ్ మూవీ ఒరిజినల్ హింది వెర్షన్ స్పెషల్ చబ్బీస్ దర్శకుడు నీరజ్ పాండేనే. అందుకే ఆయన సినిమా అయితే తన టాలెంట్ నార్త్ ప్రేక్షకులకు కూడా తెలుస్తుంది అని రకుల్ గట్టి నమ్మకంతో అయారిలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కోసం రకుల్ ఇచ్చిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చక్కనమ్మా చిక్కినా అందమే అన్న తరహాలో కొంచెం సన్నబడినట్టు కనిపిస్తున్న రకుల్ సింగల్ ఫ్రాక్ కాస్ట్యూమ్ లో తనకు మరీ మొహమాటం ఏమి లేదు అని చెప్పకనే చెప్పినట్టు ఉంది. లాస్ట్ ఇయర్ చెప్పుకోదగ్గ భారీ బ్లాక్ బస్టర్ తెలుగులో ఏది లేకపోవడం రకుల్ ని కొంత నిరాశ పరిచింది. స్పైడర్ ఎక్కడికో తీసుకెళ్తుంది అనుకుంటే మొత్తానికే మోసం చేసింది. వంశీ పైడిపల్లి-మహేష్ కాంబో మూవీలో ఛాన్స్ జస్ట్ లో మిస్ అయినట్టు గాసిప్ ఇప్పటికే ప్రచారంలో ఉంది. అయారి మూవీలో తనకు బాగా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చారని చెబుతున్న రకుల్ ఇది హిట్ అయితే తనకు బాలీవుడ్ అవకాశాలు వెల్లువలా వస్తాయని ఆశిస్తోంది. మరి తన ముంబై ఎంట్రీ ఎలా ఉందో తెలియాలంటే జనవరి 26 దాకా వెయిట్ చేయక తప్పదు.