Begin typing your search above and press return to search.

కోనకు కొత్త ఫ్రెండ్స్ దొరికేశారు

By:  Tupaki Desk   |   7 Feb 2017 4:28 AM GMT
కోనకు కొత్త ఫ్రెండ్స్ దొరికేశారు
X
స్టార్ రైటర్ స్టేటస్ ను ఎంజాయ్ చేసి.. ఆ తర్వాత మూస సినిమాల రైటర్ గా విమర్శలు ఎదుర్కొన్నాడు కోన వెంకట్. కానీ ఆయన సోదరి నీరజ కోన మాత్రం.. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంటూ.. తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటోంది. కాస్ట్యూమ్ డిజైనర్ గా.. సెలబ్రిటీ స్టైలిస్ట్ గా టాలీవుడ్ సర్కిల్ లో ఈమె పేరు మార్మోగిపోతూ ఉంటుంది.

అయితే.. నీరజ కోన బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మొదటగా సమంత పేరే చెప్పాలి. ఈమె కొడుకుతో ఫోటో దిగి.. 'నేను అమ్మను అయ్యా' అంటూ సమంత ట్వీట్ పెట్టిందంటే.. వీరిద్దరి అనుబంధం ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధమవుతుంది. ఇప్పుడు ఈ రిలేషన్ కు దాదాపు లాంగ్ బ్రేక్ పడిపోయినట్లే. సమంత కొన్ని నెలలుగా అక్కినేని ఫ్యామిలీతోనే ఉంటోంది. పైగా చైతును పెళ్లి చేసేసుకుంటోంది కూడా. దీంతో నీరజ కోనకు కొత్త ఫ్రెండ్స్ ను వెతుక్కోక తప్పలేదు. మరి సెలబ్రిటీ స్టైలిస్ట్ కు ఆ రేంజ్ లోనే ఫ్రెండ్స్ ఉండాలి కదా!. ఇప్పుడీమె కొత్త స్నేహితురాళ్లు ఎవరో తెలుసా.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ అయిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రగ్యా జైస్వాల్.

ప్రస్తుతం నీరజ కోన.. రకుల్.. ప్రగ్యాలు ముగ్గురు బ్యాంకాక్ లోనే ఉన్నారు. వేర్వేరు సినిమాల షూటింగ్ ల కోసం వెళ్లినా.. షూటింగ్ అయిపోగానే.. ఇలా కలిసి ఎంజాయ్ చేసేస్తున్నారు ఈ ముగ్గురు స్నేహితురాళ్లు. నీరజ బుగ్గకు ముద్దు ఇచ్చి మరీ రకుల్ తన ప్రేమను ఏ రేంజ్ లో చాటుతోందో గమనించారా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/