Begin typing your search above and press return to search.

ర‌కుల్ అలా.. పూజా ఇలా.. ఫ్యాన్స్ కండిష‌న్ ఎలా?

By:  Tupaki Desk   |   27 Jan 2021 7:00 AM IST
ర‌కుల్ అలా.. పూజా ఇలా.. ఫ్యాన్స్ కండిష‌న్ ఎలా?
X
కొన్ని అందాల్ని చూసిన‌ప్పుడు.. పువ్వుల్ని, అమ్మాయిల్ని చూడమ‌న్న త్రివిక్ర‌మ్ మాట‌లు క‌ర‌క్టే అనిపిస్తుంది. కొన్ని బ్యూటీస్‌ చూస్తే.. అమ్మాయిల అందం గురించి క‌వులు, ర‌చ‌యిత‌లు చెప్పింది కూడా నిజ‌మే అనిపిస్తుంది. పేజీల‌కు పేజీలు వాళ్లు రాసిన రాత‌ల్లో న్యాయ‌మే ఉంద‌నిపిస్తుంది. అలాంటి అందాల్లో బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే.. గ్లామ‌ర్ క్వీన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఖ‌చ్చితంగా ఉంటారు.

అందంతో.. అభిన‌యంతో ఆన్ స్క్రీన్ స‌త్తా చాటుతున్న ఈ భామ‌లు.. ఆఫ్ స్క్రీన్లోనూ మ‌త్తెక్కించే అందాల‌తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటారు. అందుకే.. సోష‌ల్ నెట్వ‌ర్కింగ్ లో వీళ్ల నెట్వ‌ర్క్ మామూలుగా ఉండ‌దు మరి. త‌మ డ్రీమ్ గ‌ర్ల్స్ ఎప్పుడు ఎలాంటి ఫొటోస్ షేర్ చేస్తారా? అని ఎదురు చూసే ఫ్యాన్స్ వీరికి కోకొల్ల‌లు.

అయితే.. బ్యూటీకి డెఫినెష‌న్ లెక్క ఉండే వీరిద్ద‌రూ ఒకే ఫ్రేమ్ లో క‌నిపిస్తే ఎలా ఉంటుంది? ఫ‌్యాన్స్ మైండ్ బ్లాంక్ అయిపోదూ..?! ఇప్పుడు అలాంటి ఫొటో ఒక‌టి ఇన్ స్టాగ్రామ్ లో స‌ర్క్యులేట్ అవుతోంది. మార్నింగ్ యోగా సెష‌న్ కు వెళ్తున్న ర‌కుల్ ఒక వైపు.. జిమ్ లో బ‌రువులెత్త‌డానికి పోతున్న పూజా మ‌రొక‌వైపు.. ఫొటోకు స్టిల్స్ ఇచ్చారు. మ‌రి, వీటిని చూసిన ఫ్యాన్స్ ప‌రిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి?

అందుకే.. 'నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే మా కాళ్లు' అంటూ పూజా భక్తులు.. 'నువ్వేలే నువ్వేలే.. మా ప్రాణం నువ్వేేలే..' అంటూ రకుల్ బాయ్స్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.