Begin typing your search above and press return to search.

దీపికతో తలపడుతున్న రకుల్?

By:  Tupaki Desk   |   20 Jan 2018 7:56 PM GMT
దీపికతో తలపడుతున్న రకుల్?
X

సందీప్ కిషన్ పక్కన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ప్రార్ధన గా  నటించిన రకుల్ ప్రీత్ సింగ్ మన తెలుగు ప్రేక్షకుల చూపును తన వైపు తిప్పుకుంది. కెరీర్ మొదట్లో కొన్ని ఒడిదుడుకులు చవిచూసినప్పటికి ఈ ఢిల్లీ బ్యూటీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. గత రెండేళ్లలో వరుస సూపర్ హిట్లతో టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత హిందీ లో యారియాన్ అనే సినిమాలో నటించింది. దివ్య ఖోస్లా కుమార్ అనే దర్శకురాలు డైరెక్ట్ చేసిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు హిందీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది మన రకుల్. అయ్యారి అనే పాలిటికల్ థ్రిల్లర్ లో రకుల్ ప్రీత్, బాలీవుడ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రా తో జంట కట్టబోతోంది. ప్రముఖ యాక్టర్లు మనోజ్ బాజ్పాయ్, అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కానీ నిర్మాతలు సినిమాలో ముందుగానే రిలీజ్ చేయబోతున్నారు అన్నది తాజా సమాచారం. రకుల్ అయ్యారి సినిమా జనవరి 26వ తారీఖునే థియేటర్ల లోకి రానుంది. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి 9న వస్తున్న అక్షయ్ కుమార్ ప్యాడ్ మాన్ ను కాకుండా జనవరి 25న విడుదల కాబోతున్న దీపికా పదుకొనె టైటిల్ రోల్ లో నటించిన పద్మావతి ని ఢీ కొట్టబోతోంది. మరి ప్రముఖ హీరోయిన్ అయిన దీపికా ధాటికి రకుల్ నిలబడగలదు అంటారా? వేచి చూడాల్సిందే..