Begin typing your search above and press return to search.
ఒక్క కిక్కుతో సీన్ రివర్సయ్యిందిగా...
By: Tupaki Desk | 5 Sept 2015 11:04 AM ISTసినిమా పరిశ్రమలో ఏం జరగడానికైనా ఆస్కారం ఉంది. ఓవర్ నైట్‌లో ఫేట్ మారిపోతుంది. ఒక్క రాత్రిలోనే బళ్లు ఓడలవుతాయి. ఓడలు బళ్లవుతాయిక్కడ. అందుకే ఏ రోజునీ నమ్మకు సోదరా? దొరికింది దోచుకో, దోచినంతా దాచుకో అన్నట్టే ఉంండాలని చెబుతారు. అసలింతకీ ఇంత క్లాసు ఎందుకు పీకాల్సొచ్చింది అంటే.. నిన్నటివరకూ రకూల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ అయిపోయింది అంటూ తెగ ఉబలాటపడిన వాళ్లకు ఇప్పుడు సీను రివర్సులో కనబడుతోంది.
రకూల్ నటించిన కిక్ 2 అట్టర్ ఫ్లాపైంది కాబట్టి ఇప్పుడు ఈ అమ్మడిని పిలిచి అవకాశం ఇవ్వాలంటే ఫిలిం మేకర్స్ భయపడుతున్నారు. సెంటిమెంటుకి ఎక్కువ ప్రధాన్యమిచ్చే మన పరిశ్రమలో ఇది మామూలే అయినా ఓ ప్రముఖ నిర్మాత ఫ్లాప్ హీరోయిన్ తో ఎందుకు? అని ఫీలయ్యాడంటే జయాపజయాల ఇంపాక్ట్ తారల కెరీర్ పై ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికైతే రకూల్ కి పోయేదేం లేదు. చరణ్, బన్నీ, ఇద్దరు మెగా హీరోల సినిమాలకు కమిటైంది. అలాగే తారక్ తో సినిమా ఎలానూ చేస్తోంది. మహేష్‌తో మునుముందు ఛాన్స్ ఎలానూ ఉంటుంది. ఫ్లాప్ వచ్చినప్పుడు నెగెటివ్ సెన్స్ ఆటోమెటిగ్గా వచ్చేస్తుంది. దానిని చెరిపేయాలంటే మళ్లీ ఓ హిట్టు కొట్టి చూపించడమే. చరణ్ - ఎన్టీఆర్‌లు ఈ భామకు హిట్టిచ్చి పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్టాటస్ ని కాపాడతారేమో చూడాలి.