Begin typing your search above and press return to search.
రకుల్.. తెలిసే తప్పులు చేసిందట
By: Tupaki Desk | 11 March 2018 11:00 PM IST2016లో రకుల్ ప్రీత్ సింగ్ జోరు మామూలుగా లేదు. ‘నాన్నకు ప్రేమతో’.. ‘సరైనోడు’.. ‘ధృవ’ లాంటి హిట్లతో మాంచి ఊపుమీద కనిపించింది రకుల్. కానీ గత ఏడాది మాత్రం రకుల్ కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మినహా సినిమాలన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. కొత్త ఏడాదిలో అయినా కలిసొస్తుందేమో అనుకుంటే.. ‘అయ్యారీ’ లాంటి డిజాస్టర్ తో మొదలైందీ సంవత్సరం. వరుస ఫ్లాపులకు తోడు.. తెలుగులో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో రకుల్ తిరోగమన దిశలో పయనిస్తోందన్న కామెంట్లు పడ్డాయి. ఐతే ఈ ప్రచారాన్ని రకుల్ తిప్పి కొట్టింది.
తనకు దక్షిణాదిన అవకాశాలు తగ్గిపోలేదని రకుల్ చెప్పింది. ఈ వార్తలతో తాను ఏకీభవించనని అంది. ప్రస్తుతం తాను తెలుగులో - తమిళంలో ఒక్కో సినిమా చేస్తున్నానని చెప్పింది రకుల్. తన గత సినిమాల ఫెయిల్యూర్లకు కారణాలు విశ్లేషిస్తూ.. సినిమాల ఎంపికలో తాను కొన్ని పొరబాట్లు చేసిన మాట వాస్తవమే అని రకుల్ తెలిపింది. తెలిసి కూడా కొన్ని తప్పులు చేశానని.. ఒక్కోసారి అలా చేయాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పింది. కొన్ని సందర్భాల్లో మొహమాటంతోనూ సినిమాలు చేయాల్సి ఉంటుందని.. అవి కూడా తప్పులు జరగడానికి కారణమవుతాయని.. తన సినిమాలు కొన్ని పరాజయం పాలవడానికి ఇలా చాలా కారణాలే ఉన్నాయని రకుల్ తెలిపింది. ఇకపై ఇలాంటి పొరబాట్లు జరక్కుండా చూసుకుంటానని అంది. ‘అయ్యారీ’ ఫ్లాప్ అయినప్పటికీ అందులో తన నటనకు మంచి పేరొచ్చిందని రకుల్ చెప్పింది.