Begin typing your search above and press return to search.

అతడి వయసుతో సంబంధం లేదంటున్న రకుల్‌

By:  Tupaki Desk   |   4 May 2019 10:01 AM IST
అతడి వయసుతో సంబంధం లేదంటున్న రకుల్‌
X
టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోలతో నటించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ క్రేజ్‌ కొన్నాళ్లే కొనసాగింది. గత కొంత కాలంగా సౌత్‌ లో ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతుంది. ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడిన నేపథ్యంలో టాలీవుడ్‌ లో ఈమెకు అవకాశాలు చాలా తక్కువ అయ్యాయి. ఇక తమిళంలో కూడా ఈ అమ్మడు అంతంత మాత్రంగానే అవకాశాలు దక్కించుకుంటుంది. తాజాగా ఈమె హిందీలో 'దే దే ప్యార్‌ దే' చిత్రంలో అజయ్‌ దేవగన్‌ కు జోడీగా నటించింది.

ఆ చిత్రంలో 50 ఏళ్ల హీరోకు లవర్‌ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జోడీగా నటించింది. 'దే దే ప్యార్‌ దే' చిత్రంలో హీరో అజయ్‌ దేవగన్‌ తన భార్య అయిన టబు నుండి విడిపోతాడు. ఆ తర్వాత లేటు వయసులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రేమలో పడతాడు. పాతికేళ్ల వయసు తేడా ఉన్న ప్రియురాలి వల్ల హీరో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు అనే విషయాలను చిత్రంలో సరదాగా చూపించబోతున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ కు మంచి స్పందన వస్తోంది. సౌత్‌ లో పెద్దగా సత్తా చాటలేక పోతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హిందీలో ఈ చిత్రంతో అయినా సక్సెస్‌ ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.

'దే దే ప్యార్‌ దే' చిత్రంలో స్కిన్‌ షో తో రెచ్చి పోయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రేమ, పెళ్లి విషయంపై స్పందించింది. ఇప్పటి వరకు తాను ప్రేమలో పడలేదని, మంచి వ్యక్తితో ప్రేమలో పడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా రకుల్‌ చెప్పుకొచ్చింది. దే దే ప్యార్‌ దే చిత్రం తరహాలోనే రియల్‌ లైఫ్‌ లో కాస్త ఏజ్‌ ఎక్కువ ఉన్న వ్యక్తి తారస పడితే, సినిమాలో లాంటి పరిస్థితులు ఎదురైతే ప్రేమలో పడతారా అంటూ ప్రశ్నించగా నాకు నచ్చిన వ్యక్తి ఓల్డ్‌ అయినా, యంగ్‌ అయినా వయసుతో సంబంధం లేకుండా ప్రేమిస్తాను. లవ్‌ కు ఏజ్‌ తో సంబంధం లేదు అనేది తన అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది. మరి కొన్నాళ్ల పాటు కెరీర్‌ ఇలాగే కష్టాల్లో కొనసాగితే ఈమె పెళ్లికి సిద్దమవుతుందేమో చూడాలి.