Begin typing your search above and press return to search.

లోప‌లి చెత్త శుభ్రప‌డితేనే అందం ఆరోగ్యం!-ర‌కుల్

By:  Tupaki Desk   |   9 April 2021 6:00 AM IST
లోప‌లి చెత్త శుభ్రప‌డితేనే అందం ఆరోగ్యం!-ర‌కుల్
X
ప్రపంచ ఆరోగ్య దినోత్స‌వం సంద‌ర్భంగా సెల‌బ్రిటీలంతా ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉండేందుకు ర‌క‌ర‌కాల టిప్స్ ని అందించారు. ఇక టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ ర‌కుల్ ప్రీత్ ఇచ్చిన టిప్స్ అంతే ఆస‌క్తిక‌రం.ర‌కుల్ త‌న చాటింగ్ లో మ‌నిషి ఆరోగ్యం రెండు విష‌యాల‌పై ఆధార‌పడి ఉంటుంద‌ని తెలిపారు. ఒక‌టి శారీర‌క ఆరోగ్యం.. రెండోది మాన‌సిక ఒత్తిళ్ల‌ను అధిగ‌మించ‌డం. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకునేందుకు త‌గు ఆహారాన్ని వ్యాయామాల్ని అనుస‌రించాల‌ని ర‌కుల్ తెలిపారు.

మంచి ఆహార‌పు అల‌వాట్ల‌ను ప్ర‌స్థావించారు. దొరికింద‌ల్లా తిని తంటాలు కొని తెచ్చుకునేవాళ్లు పాత‌కాలం బామ్మ‌ల తిండి అల‌వాట్ల‌ను ప‌రిశీలించాల‌ని ర‌కుల్ సూచించారు. నాటి అల‌వాట్లు మంచివి. అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడ‌లా కాదు. ఏదో ఒక‌టి తింటున్నారు. అలా కాకుండా ఆరోగ్యం అనేది ఒక స‌బ్జెక్ట్ లా భావించి తినే అల‌వాట్లు మార్చుకోవాల‌ని ర‌కుల్ సూచించారు.

అలాగే మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి ర‌కుల్ చాలా వివ‌రించారు. ఒకరిని సంతోషపరిచే పనులు చేయడం చాలా అవసరం. లోప‌లి నుంచి శుభ్ర‌ప‌డితేనే బాహ్యంగా అందంగా ఉండ‌గ‌లం అని ర‌కుల్ తెలిపారు. ఇది వ్యాయామశాలలో శ్ర‌మించ‌డం లేదా సన్నగా కనిపించడం గురించిన విష‌యం కాదు. కానీ మిమ్మ‌ల్ని మీరు ఉత్త‌మంగా మ‌లుచుకునే సాధ‌నం ఇది. మీలో మీరు మంచి అనుభూతి చెందాలి. మీరు చేయాలనుకునే కార్యకలాపాల ఎంపిక ముఖ్యం. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాధించండి. మీ శరీరం మనస్సు ఆత్మను ఆరోగ్యకరమైన ఆలోచనలతో పెంచి పోషించండి. మీలోని లోపలి పిల్లవాడిని ఎల్లప్పుడూ ఉత్సాహ‌ప‌ర‌చ‌డం మ‌ర్చిపోవ‌ద్దు. పిచ్చిగా ఉండండి.. సరదాగా ఉండండి.. యాదృచ్ఛికంగా ఉండండి.. కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి`` అని అన్నారు. ర‌కుల్ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో మేడే చిత్రీక‌ర‌ణ స‌హా ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. వైష్ణ‌వ్ తేజ్ -క్రిష్ మూవీని పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. భార‌తీయుడు 2 వివాదాల కార‌ణంగా చిత్రీక‌ర‌ణ సాగ‌డం లేదు.