Begin typing your search above and press return to search.

#థాంక్ గాడ్‌.. ఈ ఆఫ‌ర్ తో ర‌కుల్ కి చిక్కులే!

By:  Tupaki Desk   |   7 Jan 2021 12:06 PM IST
#థాంక్ గాడ్‌.. ఈ ఆఫ‌ర్ తో ర‌కుల్ కి చిక్కులే!
X
ఓవైపు ఎఫైర్ అంటూ ప్ర‌చారం సాగింది. తొలిసారి జంట‌గా క‌లిసి న‌టించింది మొద‌లు ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో ఉంద‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. ఆ త‌ర్వాత ఆ హీరో వేరొక యువ‌నాయిక‌తోనూ చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్ చేస్తున్నాడు. ఇంత‌లోనే మ‌ళ్లీ పాత స్నేహితురాలు అత‌డి స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కించుకుంది. గ‌త‌ ప్రేమాయ‌ణం మాటేమో కానీ.. మొత్తానికి అదే జోడీ తో మ‌రో సినిమాని తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాలు సాగుతుండ‌డం హాట్ టాపిక్ గా మారింది.

ఇదంతా ఏ జోడీ గురించి అంటే.. ర‌కుల్ ప్రీత్ సింగ్- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా జంట గురించే. ఈ జోడీ క‌లిసి మ‌రోసారి పెద్ద‌ తెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారు. అది కూడా ర‌కుల్ బాలీవుడ్ మెంటార్ అజ‌య్ దేవ‌గ‌న్ తో క‌లిసి అన్న‌దే హాట్ టాపిక్ గా మారింది.

ర‌కుల్ ఇప్ప‌టికే అజయ్ దేవ్ గన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న `మేడే` చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటోంది. అమితాబ్ బచ్చన్- అజయ్ దేవ్ గన్ కాంబినేష‌న్ తో ఆన్ లొకేష‌న్ క‌లిసి ప‌ని చేస్తోంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మెజారిటీ చిత్రీక‌ర‌ణ సాగుతోంది.

ఈలోగానే మ‌రో క్రేజీ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ర‌కుల్ మ‌రో భారీ చిత్రానికి సంత‌కం చేస్తే ఇందులోనూ సిద్ధార్థ్ ఒక క‌థానాయ‌కుడు. అజ‌య్ దేవ‌గ‌న్ య‌థావిధిగా వేరొక హీరోగా క‌నిపించ‌నున్నారు. టీసిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `థాంక్ గాడ్` అనే టైటిల్ ని ప్ర‌క‌టించారు. ఇంద్ర కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమా ప్రారంభమవుతుంది. ఒకే జోడీ ప‌దే ప‌దే రిపీటైతే బాలీవుడ్ మీడియా ఏ రేంజులో క‌థ‌నాలు వండి వారుస్తుందో చెప్పాల్సిన ప‌నే లేదు. అయితే సిద్ధార్థ్ త‌న‌కు స్నేహితుడు మాత్ర‌మేన‌ని ర‌కుల్ ప్ర‌తిసారీ చెబుతున్నారు.

మ‌రోవైపు ర‌కుల్ కెరీర్ ని ప‌రిశీలిస్తే.. వైష్ణ‌వ్ తేజ్ -కొండ‌పొలం స‌హా.. నితిన్ తో `చెక్` చిత్రీకరణల‌ను పూర్తి చేశారు. మ‌రి కొన్ని తెలుగు చిత్రాల‌కు సంత‌కాలు చేయ‌నున్నార‌ని స‌మాచారం. భార‌తీయుడు 2 కి సంబంధించిన తాజా అప్ డేట్ రావాల్సి ఉంది.