Begin typing your search above and press return to search.

ఆ ప్లేస్ ని మిస్సవుతున్నా

By:  Tupaki Desk   |   6 Sep 2017 6:00 AM GMT
ఆ ప్లేస్ ని మిస్సవుతున్నా
X
షూటింగ్ లలో బిజీగా ఉండే నటీనటులు ఒక్కోసారి ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం సినిమా కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఎన్ని లొకేషన్స్ కి వెళ్లినా ప్రపంచ దేశాలను చుట్టేసినా ఎక్కువగా పట్టించుకోరు. తొందరగా షూటింగ్ కంప్లిట్ చేసి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. కానీ ఎప్పుడు చూడని లొకేషన్స్ కి వెళితే మాత్రం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నటులు షూటింగ్ కి బ్రేక్ చెప్పి సరదాగా అలా ఓ లుక్కేసి వస్తారు.

అదే తరహాలో సౌత్ సుందరి రకుల్ కూడా షూటింగ్ లేని సమయంలో ఒక ప్రాంతాన్ని ఆసక్తిగా ఇష్టంగా చుట్టేసిందట. మొన్నటి వరకు స్పైడర్ పాట కోసం రొమానియా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాటను సిబియూ ప్రాంత పరిసరాల్లో చిత్ర యూనిట్ షూటింగ్ నిర్వహించింది. అయితే రకుల్ ఆ ప్లేస్ ని ఇప్పుడు చాలా మిస్ అవుతుందట. డ్రాకుల బర్త్ ప్లేస్ కావడంతో అమ్మడికి అక్కడి వాతావరణం తెగ నచ్చేసిందని. ముఖ్యంగా డ్రాకుల కోటను బయట నుంచి చూసి ఆశ్చర్య పోయిందట. కానీ లోపలికి వెళ్లి చూసే ఛాన్స్ దక్కలేదు అని చెబుతోంది రకుల్.

ఇంకా ఏమంటోందంటే..కొందరి సహాయంతో అక్కడ డ్రాకుల ఫేవరేట్ మీల్స్ ని లాగించేసా ఇంకా అక్కడి స్పెషల్ ప్లేసెస్ ని చుట్టేయ్యలని అనుకున్న. కానీ తెలుగు - తమిళ్ భాషలో స్పైడర్ సినిమా షూటింగ్ జరుగుతోంది కాబట్టి ఖాళీ దొరకలేదు. కానీ ఎప్పటికైనా ఆ ప్లేస్ ని ఫుల్ గా చూసే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఇక స్పైడర్ సినిమా విషయానికి వస్తే .. షూటింగ్ దాదాపు ఏండింగ్ కి వచ్చేసింది. వచ్చేనెల మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా స్పైడర్ రిలీజ్ కాబోతోంది.