Begin typing your search above and press return to search.

పొరుగు హీరోల‌తో లాలూచీ.. వెట‌ర‌న్స్ బాట‌లో జూనియ‌ర్లు!

By:  Tupaki Desk   |   11 Oct 2021 8:30 AM GMT
పొరుగు హీరోల‌తో లాలూచీ.. వెట‌ర‌న్స్ బాట‌లో జూనియ‌ర్లు!
X
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ లుగా ఓ వెలుగు వెలిగిన వారంతా వ‌న్ బై వ‌న్ వైవాహిక జీవితంలోకి ఎంట‌ర‌వుతున్నారు. ఇటీవ‌ల అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ తన చిర‌కాల మిత్రుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో మ‌రో హీరోయిన్ రకుల్ కూడా పెళ్లికి రెడీ అయిపోతోంది. తెలుగులో అన‌తి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకున్న ర‌కుల్ ఆదివారం త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గుడ్ న్యూస్ ని ప్ర‌క‌టించింది.

ఇత‌నే త‌న సోల్‌మేట్ అంటూ బాలీవుడ్ న‌టుడు.. నిర్మాత జాకీ భ‌గ్నానీని త్వ‌ర‌లో వివాహం చేసుకోబోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. దీంతో టాలీవుడ్‌.. బాలీవుడ్‌.. కోలీవుడ్ లలో ర‌కుల్ పెళ్లి వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈత‌ర‌హా పెళ్లిళ్లు టాలీవుడ్ కు కొత్త కాదు గ‌తంలో తెలుగులో టాప్ హీరోయిన్ లుగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లు బాలీవుడ్ వాళ్ల‌ని వివాహం చేసుకున్న ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లోనూ త‌మ స‌త్తాని చాటుకున్న మ‌న హీరోయిన్ లు వైవాహిక జీవితం కోసం బాలీవుడ్ వారినే ఎంచుకోకున్నారు.

`ప‌ద‌హారేళ్ల వ‌య‌సు` సినిమాతో న‌టిగా త‌న కెరీర్ ని మ‌లుపు తిప్పుకుని అతిలోక సుంద‌రిగా నీరాజ‌నాలందుకున్న శ్రీ‌దేవి బాలీవుడ్ లోనూ సూప‌ర్ స్టార్ ల సర‌స‌న న‌టించి దేశ వ్యాప్తంగా పాపులారిటీని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీ‌దేవి ఆ త‌రువాత అక్క‌డి నిర్మాత బోనీ క‌పూర్‌ని వివాహం చేసుకుని అక్క‌డే సెటిలైపోయింది. శ్రీ‌దేవి త‌రువాత అదే త‌ర‌మాలో జ‌య‌ప్ర‌ద‌.. జ‌య‌సుధ బాలీవుడ్ కు చెందిన వారినే వివాహం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. తెలుగు సినిమా రంగాన్ని ద‌శాబ్దాల కాలం పాటు ఏలిన జ‌య‌సుధ బాలీవుడ్ నిర్మాత‌.. సీనియ‌ర్ హీరో జితేంద్ర బంధువు అయిన నితిన్ క‌పూర్ ని వివాహం చేసుకున్నారు.

ఆ త‌రువాత న‌టి జ‌య‌ప్ర‌ద కూడా జ‌య‌సుధ త‌ర‌హాలో బాలీవుడ్ నిర్మాత‌నే వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ లో పాపుల‌ర్ నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న శ్రీ‌కాంత్ న‌హ‌తాను జ‌య‌ప్ర‌ద వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి 1989లో జ‌రిగింది. ఈ ఇద్ద‌రి త‌రువాత వీరి త‌ర‌హాలోనే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూస‌ర్ జాకీ భ‌గ్నానీని వివాహం చేసుకోబోతోంది. ఆదివారం త‌న ప్రేమ విష‌యాన్ని ప్ర‌క‌టించిన ర‌కుల్ పెళ్లి ఎప్పుడన్న‌ది మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. దీంతో వీరి పెళ్లి వార్త ఇప్ప‌టికైతే స‌స్సెన్స్.

ఇక టాలీవుడ్ లోనే పాపుల‌రైన చాలా మంది హీరోయిన్లు ఎంతో తెలివిగా క్రీడాకారుల‌ను ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌య శ‌ర‌ణ్ విదేఈ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడారు. తాప్సీ ఓ విదేశీ క్రీడాకారుడు మాథ్యూస్ తో ప్రేమ‌లో ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ప‌లువురు నాయిక‌లు ప్ర‌ముఖ క్రీడాకారుల‌ను పెళ్లాడి లైఫ్ లో సెటిల‌య్యారు.