Begin typing your search above and press return to search.

ర‌కుల్ ఆ న‌వ్వులు ప‌ర్మినెంట్ చేసేదెలా?

By:  Tupaki Desk   |   16 April 2021 4:30 AM GMT
ర‌కుల్ ఆ న‌వ్వులు ప‌ర్మినెంట్ చేసేదెలా?
X
ఓవైపు తెలుగు సినిమాల్లో న‌టిస్తూనే బాలీవుడ్ ని మ్యానేజ్ చేస్తూ క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది ర‌కుల్ ప్రీత్. ఈ పంజాబీ బ్యూటీ న‌టించిన తాజా చిత్రం స‌ర్ధార్ కా గ్రాండ్ స‌న్ త్వ‌ర‌లో రిలీజ్ కి రానుంది. ఈ చిత్రంలో అర్జున్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. ప్ర‌స్తుతం ప్ర‌చారంలో స్పీడ్ పెంచింది టీమ్. అలాగే సినిమా రిలీజ్ ముందు లీడ్ పెయిర్ పై వీడియో ఆల్బ‌మ్ తాజాగా హాట్ టాపిక్ గా మారింది.

అర్జున్ కపూర్ - రకుల్ ప్రీత్ సింగ్ మ్యూజిక్ వీడియో `దిల్ హై దీవానా` టీజ‌ర్ ఇప్ప‌టికే శ్రోత‌ల ముందుకు వ‌చ్చింది. మంచి చెడు అందం గురించిన ఉద్వేగాలు నింపే ఆక‌ర్ష‌ణీయ‌మైన పాట ఇది. సరదాగా నిండిన ప్రేమకథ ఇది! # దిల్‌హైదీవానా పూర్తి మ్యూజిక్ వీడియో ఏప్రిల్ 17న విడుదల కానుంది అని ర‌కుల్ తెలిపారు. ఈ పాట‌ను తానిష్ బాగ్చి స్వ‌ర‌ప‌రిచారు. దర్శన్ రావల్ - జరా ఖాన్ ఈ పాటకి గాత్రదానం చేశారు. షబ్బీర్ అహ్మద్ గీత రచయిత. వీడియోకు వినయ్ సప్రూ- రాధిక రావు దర్శకత్వం(కొరియోగ్ర‌ఫీ) వహించారు.

సర్దార్ కా గ్రాండ్సన్ పూర్తి రొమాంటిక్ ల‌వ్ స్టోరి. ఈ చిత్రంలో అర్జున్ - రకుల్ ప్రీత్ జంట కెమిస్ట్రీ అద్భుతంగా పండింద‌ని టీమ్ చెబుతోంది. ఇది సరిహద్దు ప్రేమకథ. కాశ్వీ నాయర్ దర్శకత్వం వహించారు. ఆసక్తికరంగా కరోనావైరస్ మహమ్మారి టెన్ష‌న్స్ న‌డుమ‌ ఈ చిత్రాన్ని పూర్తి చేసారు. ఈ ప్రాజెక్టులో సోని రజ్దాన్- నీనా గుప్తా- దివ్య సేథ్ షా కూడా ఉన్నారు.

నెట్ ఫ్లిక్స్ లో ఈ రొమాన్స్ డ్రామాను చూడటానికి ముందు అభిమానులకు దిల్ హై దీవానాలో రకుల్ ప్రీత్ - అర్జున్ కెమిస్ట్రీ అదిరిపోతుంద‌ని టీమ్ ప్ర‌చారం చేస్తోంది.. మ‌రో ట్వీట్ లో ర‌కుల్ స్మైలీ లుక్ ని షేర్ చేసి ..ఆ న‌వ్వు మ‌న హృద‌యాల్లో ప‌ర్మినెంట్ గా సెటిల‌వుతుంద‌ని కితాబిచ్చేస్తున్నారు.