Begin typing your search above and press return to search.

ట్రెంచ్ కోట్ లో ర‌కుల్ ర‌ఫ్ఫాడించిందిగా..

By:  Tupaki Desk   |   21 March 2021 5:30 PM GMT
ట్రెంచ్ కోట్ లో ర‌కుల్ ర‌ఫ్ఫాడించిందిగా..
X
ఓవైపు క‌థానాయిక‌గా న‌టిస్తూనే మ‌రోవైపు ఎంట‌ర్ ప్రెన్యూర్ గా రాణిస్తోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ బ్యూటీ ఎఫ్ 45 పేరుతో ఫిట్నెస్ జిమ్ ల‌ను మెట్రో న‌గ‌రాల్లో విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా స‌మ‌యంలోనూ ప‌ని లేక‌పోయినా ఉద్యోగుల‌కు జీతాలిచ్చామ‌ని ర‌కుల్ వెల్ల‌డించారు.

ఇక ర‌కుల్ అటు బాలీవుడ్ లో వ‌రుస సినిమాల్లో న‌టిస్తూనే టాలీవుడ్ లోనూ ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు. ఇక్క‌డ అక్క‌డ అవ‌స‌రాన్ని బ‌ట్టి రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణంతో ముందుకు సాగిపోతోంది.

అలాగే దీపం ఉండ‌గానే చ‌క్క‌దిద్దుకునే ప్రాసెస్ లోనే.. ర‌కుల్ సామాజిక మాధ్య‌మాల్లోనూ భారీగా ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది. అందుకోసం నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. గ‌త రెండ్రోజులుగా ప్ర‌ఖ్యాత ఎలైట్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్ ఫోటోల్ని ర‌కుల్ షేర్ చేస్తుండ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

తాజాగా ఈ ఫోటోషూట్ నుంచి మరో ఎక్స్ క్లూజివ్ ఫోటోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ``గెలువ్ లేదా నేర్చుకో.. కానీ ఎప్ప‌టికీ లాస్ అవ్వ‌కు..! సండే థాట్స్!! అంటూ ట్రెంచ్ కోట్ స్క‌ర్ట్ ధ‌రించిన ఫోటోని ర‌కుల్ షేర్ చేసింది. కామ్నామాలిక్ .. రావ్.. జ‌హా.. పింకీ.. టీనా త‌దిత‌రులు ఈ డిజైన‌ర్ లుక్ వెన‌క సైన్యం అని ర‌కుల్ వెల్ల‌డించింది.