Begin typing your search above and press return to search.
సూపర్ హీరో.. నా రాక్ స్టార్! అంటూ షష్ఠిపూర్తి డాడీని పొగిడేసిన రకుల్!!
By: Tupaki Desk | 2 March 2021 11:07 AM ISTకంటే కూతురినే కనాలి! అంటూ వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ఆ ఎమోషనల్ సాంగ్ ని అంత తేలిగ్గా తెలుగు ఆడియెన్ మర్చిపోలేరు. కూతురిని కంటే ప్రయోజనం ఏంటో ఇదిగో ఇక్కడ రకుల్ ని చూసి చెప్పొచ్చు.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలిన రకుల్ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దింది. తన సోదరుడిని హీరోగా పరిచయం చేస్తోంది. అలాగే ఎఫ్ 45 పేరుతో జిమ్ములు ప్రారంభించి ఫ్రాంఛైజీ బిజినెస్ తో ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగింది. ఇన్ని చేసినా ఇంత బిజీ లైఫ్ లో తన కుటుంబాన్ని అస్సలు విడిచిపెట్టదు. తనకు ఎంతో ప్రీతిపాత్రుడైన తన తండ్రిని అసలే వదిలి దూరంగా ఉండలేదు.
నేడు ఆయన తన 60 వ పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ రకుల్ ఓ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది. తండ్రితో తన అనుబంధానికి సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో ఇది. తన తండ్రి రాజ్ వీందర్ సింగ్ తో కలిసి ఉన్న ఫోటో.
తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాదు.. ఒక ఎమోషనల్ నోట్ ని రాసుకొచ్చిందిలా. ``నేను ఎక్కడ నుండి ప్రారంభించాలి.. నేను ఎక్కడ ముగించాలి? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో .. మీ నుండి నేను పొందిన ప్రేరణను పదాల్లో ఎప్పుడూ వ్యక్తపరచలేను. నా మొదటి గురువు నుండి.. నా బలం.. నా మద్దతు.. నా అతిపెద్ద విమర్శకుడు.. క్రమశిక్షణా.. మీరు నా సూపర్‌హీరో.. మిమ్మల్ని ఎప్పుడూ గర్వపడేలా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే .. 60వ బర్త్ డే మై రాక్ స్టార్.. లవ్ యు`` అంటూ ఎమోషనల్ అయ్యింది రకుల్.
రకుల్ ఇంతకుముందే తన కుటుంబంతో కలిసి మాల్డివులకు వెకేషన్ కోసం వెళ్లారు. తల్లిదండ్రులు సోదరుడితో కలిసి ఒంటరి దీవుల్లో విహరించారు. ఆ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. వీలున్న ప్రతిసారీ తన తండ్రితో కలిసి రెస్టారెంట్ లకు వెళుతుంటుంది. ప్రతి చిన్న అకేషన్ ని కుటుంబంతో సెలబ్రేట్ చేసుకుంటుంది. ఫ్యామిలీ బాండింగ్ లో ఈ స్టార్ కం డాటర్ గ్రేట్ అని నిరూపిస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... రకుల్ ప్రీత్ సింగ్ చివరిసారిగా తెలుగు చిత్రం `చెక్` లో నటించింది. వైష్ణవ్ తేజ్ తో కలిసి క్రిష్ దర్శకత్వంలో నటించింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. బాలీవుడ్ లో ప్రస్తుతం మేడే- సర్దార్ కా గ్రాండ్సన్- ఎటాక్- థాంక్ గాడ్ చిత్రాల్లో నటిస్తోంది. డాక్టర్ జి అనే చిత్రంలోనూ ఒక కీలక పాత్ర పోషిస్తోంది.