Begin typing your search above and press return to search.

హైదరాబాద్ చేరిన ప్రముఖ సినీతార.. ఇంట్లో ఏం చేస్తుందంటే..??

By:  Tupaki Desk   |   24 July 2020 9:15 AM IST
హైదరాబాద్ చేరిన ప్రముఖ సినీతార.. ఇంట్లో ఏం చేస్తుందంటే..??
X
ముంబైలో మూడు నెలల పాటు ఒకేచోట గడిపిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే హైదరాబాద్ చేరుకుంది. దాదాపు ఆరు నెలల తర్వాత రకుల్ హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తుంది. ముంబైలో ఈ విశ్వం తనకు సహాయం చేసిందని రకుల్ ప్రీత్ సింగ్ తన లాక్డౌన్ అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తన సోదరుడు అమన్ ప్రీత్ ఒక మీటింగ్ కోసం ముంబైకి వచ్చి లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయాడని చెప్పింది. ఒకవైపు విమాన సర్వీసులు లేక మరోవైపు లాక్ డౌన్ విధించినందున.. అమన్ నా దగ్గరే ఉండిపోయాడు. లేకపోతే నేను ఒంటరిగా ఉండేదాన్ని. "విశ్వం మా ఇద్దరినీ ఒకేచోట చేర్చిందని చెప్పిన రకుల్.. ఇటీవలే ప్రభుత్వం ప్రయాణ సడలింపులు అమలు చేయడంతో వెంటనే తన స్వస్థలమైన గుర్గావ్‌కు వెళ్ళిపోయింది.

అయితే అమ్మడిని ముంబైకి.. సొంత ఊరికి తేడా ఏంటని అడిగితే.. "ఎక్కడైనా మీరు ఇంట్లో మాత్రమే ఉంటున్నందు వలన ప్రతి ప్రదేశం ఒకేలా ఉంటుందని సమాధానం చెప్పింది. అయితే ఇటీవల ఓ బాలీవుడ్ ఫిల్మ్ కోసం మళ్లీ ముంబై వెళ్లిన రకుల్ తాజాగా హైదరాబాద్ ఇంటికి చేరుకుందని ఆమె మేనేజర్ తెలిపాడు. అమ్మడు ఇటీవలే ముంబైలో సొంతంగా ఇల్లు కొనుక్కుంది. అంతకు ముందే హైదరాబాద్ లో ఇల్లు కొని పెట్టుకుందట. ప్రస్తుతం అదే ఇంటికి చేరింది. ఇక ఆరు నెలల తర్వాత వచ్చేసరికి ఇల్లును క్లీన్ చేసే పనిలో పడిందట. ఏం చేద్దాం ఎలాగో షూటింగ్స్ లేవు కదా.. అని ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఇల్లంతా శుభ్రం చేసుకుందని సమాచారం. ఇదిలా ఉండగా రకుల్ ప్రస్తుతం స్టార్ హీరో కమల్ హాసన్ సరసన ఇండియన్-2, శివకార్తికేయన్ సరసన అయలన్ మూవీస్ చేస్తోంది. అంతేగాక పలు బాలీవుడ్ సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి తెలుగు తప్ప ఆ రెండు ఇండస్ట్రీలలో అమ్మడు బిజీ కానుందన్న మాట!