Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ తమ్ముడు హీరో అవుతున్నాడు

By:  Tupaki Desk   |   13 Dec 2016 10:14 AM GMT
స్టార్ హీరోయిన్ తమ్ముడు హీరో అవుతున్నాడు
X
ఒక హీరో కొంచెం స్టార్ ఇమేజ్ సంపాదించాడంటే చాలు.. ఇక అతడి ఫ్యామిలీలో తరతరాలు ఇండస్ట్రీపై బతికేయొచ్చు. స్టార్ హీరోల తమ్ముళ్లు.. కొడుకులు.. మేనల్లుళ్లు.. ఇంకా తర్వాతి తర్వాతి తరాల వాళ్లు కూడా హీరోలు అయిపోవచ్చు. ఇందుకు టాలీవుడ్లో చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ఐతే హీరోయిన్ల వారసులు ఇండస్ట్రీకి రావడం.. హీరో హీరోయిన్లు కావడం తక్కువే. ఐతే కొందరు హీరోయిన్లు మాత్రం తమకున్న ఇమేజ్ ను వాడుకుని తమ వాళ్లను సినిమాల్లోకి దించే ప్రయత్నం చేస్తుంటారు. ఆర్తి అగర్వాల్.. కాజల్ అగర్వాల్ లతో పాటు ఇంకొంతమంది హీరోయిన్లు తమ చెల్లెళ్లను హీరోయిన్లుగా తీసుకొచ్చారు.

ఐతే హీరోయిన్ల సోదరులు హీరోలవడం మాత్రం అరుదు. ఈ కోవలోకే రకుల్ ప్రీత్ చేరబోతోంది. ఆమె సోదరుడు అమన్ ను హీరోగా పరిచయం చేయడానికి రకుల్ రంగం సిద్ధం చేస్తోంది. ఫామ్.. అవకాశాల పరంగా చూస్తే రకుల్ ప్రస్తుతం టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ అనడంలో సందేహం లేదు. ఆమెకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. పరిచయాలున్నాయి. వీటిని ఉపయోగించుకుని అమన్ ను హీరోగా పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తోంది రకుల్. ఆల్రెడీ ఒకట్రెండు ప్రొడక్షన్ హౌజ్ లతో.. రచయితలతో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఆ మధ్య రకుల్ మొదలుపెట్టిన ‘ఎఫ్ 45’ జిమ్ ప్రారంభోత్సవంలో అమన్ పాల్గొన్నాడు. ఆ సందర్భంగా ఇండస్ట్రీలో చాలామందితో పరిచయాలు జరిగాయి. త్వరలోనే అమన్ హీరోగా సినిమా ప్రారంభం కావచ్చని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/