Begin typing your search above and press return to search.

పూరి కంపెనీ యాడ్లు కూడా తీస్తోందా??

By:  Tupaki Desk   |   14 Oct 2016 11:00 PM IST
పూరి కంపెనీ యాడ్లు కూడా తీస్తోందా??
X
పూరి జగన్. కేవలం దర్శకుడు మాత్రమే కాదు. ఈ మధ్యనే బిజినెస్మ్యాన్ గా కూడా మారిపోయాడు. మనోడు ''పూరి కనెక్ట్స్'' అంటూ ఒక టాలెంట్ మేనేజ్మంట్ ఏజన్సీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ఈ ఏజన్సీ వారు ముంబయ్ మోడల్స్ కు గ్రూమింగ్ ఇచ్చి తెలుగు నేర్పి మనకు అప్పజెప్పట్లేదు.. వేరే సైడ్ యాపారాలు కూడా చేస్తున్నారు.

ఈ మధ్యన విడుదలైన రకుల్ ప్రీత్ సింగ్ కొత్తయాడ్ ఒకటి మీరు చూసే ఉంటారు. ఒక ప్రముఖ సెల్ ఫోన్లు అమ్ముకునే రిటైలర్ కు అమ్మడు బ్రాండ్ ఎంబాసిడర్ గా మారింది. అయితే ఆమెను అంబాసిడర్ చేసింది పూరి కనక్ట్స్ వారేనట. అంతేకాదు.. ఇప్పుడు ఆ బ్రాండ్ కోసం యాడ్స్ కూడా ఈ సంస్థే తీస్తోంది. అంటే ఒక్క విషయం అర్ధమైంది. కేవలం టాలెంట్ ఏజన్సీ మాత్రమే కాకుండా.. సొంతంగా పూరి యాడ్ ఏజెన్సీ కూడా పెట్టుకున్నాడనమాట.

సో ఫ్యూచర్లో సినిమాల్లో అవకాశాలు సన్నగిల్లితే.. హ్యాపీగా ఇన్నాళ్ళూ వచ్చిన ఎక్సపీరియన్స్ తోమనోడు చక్కగా యాడ్లు తీసుకుంటూ బతికేస్తాడు. అక్కడ కూడా డైరక్టర్లకూ అలాగే యాడ్ ఫిలిం మేకర్లకూ తక్కువ పేమెంట్లేం రావుగా. ఇరగదీస్తున్నావ్ పూరి. వాటే ప్లానింగ్.





Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/