Begin typing your search above and press return to search.

ర‌కుల్ సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్ త‌ట్టి లేపే ద‌మ్ముందా?

By:  Tupaki Desk   |   23 Nov 2022 2:30 AM GMT
ర‌కుల్ సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్ త‌ట్టి లేపే ద‌మ్ముందా?
X
ఒక్కొక్క‌రి లో ఒక్కో హిడెన్ ట్యాలెంట్ ఉంటుంది. అది చాలా రేర్ గా బ‌య‌ట‌ప‌డుతుంది. ఆ ప్ర‌తిభ గురించి ప‌క్కోళ్ల‌కి తెలుస్తుంది త‌ప్ప‌..త‌న‌కు తెలియ‌దంటారు. అలాగే అందాల ర‌కుల్ ప్రీత్ సింగ్ లో హిడెన్ ట్యాలెంట్ గురించి ప‌క్కోళ్లు త‌న‌కు చెప్పే వ‌ర‌కూ తెలియ‌దనేసింది. ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో ర‌కుల్ కి ఈ ర‌క‌మైన ప్ర‌శ్న ఎదురైతే ఎన్నో విష‌యాలు పంచుకుంది.

'నాలో మంచి సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఉంద‌ని చాలా మంది అంటుంటారు. అది ఎలా ఉంటుందో నాకు తెలియ‌దుగానీ..న‌న్ను ద‌గ్గ‌ర‌గా చూసే వాళ్ల‌కు మాత్రం ఆవిష‌యం బాగా తెలుసు. కానీ దాన్ని ఇప్ప‌టిర‌కూ ఏ ద‌ర్శ‌కుడు బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నంచేయ‌లేదు. బ‌హుశా ద‌ర్శ‌కులు న‌న్ను ద‌గ్గ‌ర నుంచి చూడ‌లేక‌పోవ‌డం వ‌ల్ల ఆ విష‌యం వాళ్ల‌కు తెలిసి ఉండ‌దు అనేసింది.

హాస్య ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టించ‌డం అంటే చాలా ఇష్టం. అలాగే ఒక ఫ‌క్తు కామెడీ చిత్రంలో న‌టించాల‌ని ఉంది. అలాగే హృదయాన్ని హ‌త్తుకునే ప్రేమ‌ క‌థ‌ల్లోనూ న‌టించాల‌ని ఉంది.

'ఆషీకి' లాంటి సినిమాలు చేయాల‌ని ఉంది. కానీ నా ద‌గ్గ‌ర‌కు అలాటి క‌థ‌లు రావ‌డం లేదు. రాబోయే రోజుల్లోనైనా అలాంటి పాత్ర‌లు ద‌క్కుతాయ‌ని ఆశిస్తున్నా. నేను చెప్పిన ఈ విష‌యాలు ద‌ర్శ‌క‌..ర‌చ‌యిత‌ల చెవిన ప‌డాల‌ని ఆశ‌ప‌డుతున్నాను.

అలాగే ఎన్ని సినిమాల్లో న‌టంచినా ప్ర‌తీ ఆర్టిస్ట్ కి కొన్ని క్లిష‌మైన ప‌రిస్థితులు ఉంటాయి. అవి సినిమాల రూపంలో వ‌చ్చే జాన‌ర్లు కావొచ్చు. ఒక జాన‌ర్ నుంచి మ‌రో జాన‌ర్ కి మారే స‌మ‌యంలో నా వ‌ర‌కూ కొన్ని ర‌కాల ఇబ్బందుల‌కు గుర‌వుతాను' అని తెలిపింది. ర‌కుల్ కెరీర్ సంగ‌తి చూస్తే అమ్మ‌డు బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

వ‌రుస‌గా హిందీ సినిమాలు చేస్తూ మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తుంది. కానీ సాలిడ్ సౌండ్ తో ఒక్క సినిమా కూడా ఇంత‌వ‌ర‌కూ బాక్సాఫీస్నిషేక్ చేయ‌లేదు. చేతిలో అవ‌కాశాలైతే పుష్క‌లంగా ఉన్నాయి. అలాగే ఇండియ‌న్ -2 లోనూ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.