Begin typing your search above and press return to search.

బాబోయ్‌.. జీవితంలో అటు వెళ్లను

By:  Tupaki Desk   |   16 Feb 2019 5:56 AM GMT
బాబోయ్‌.. జీవితంలో అటు వెళ్లను
X
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు ఊహించని షాక్‌ ఒకటి తలిగిందట. ఆ షాక్‌ తో ఆమె మరోసారి అటు వైపు కూడా వెళ్లకూడదని నిర్ణయించుకుందట. ఇంతకు ఆ షాక్‌ ఏంటో తెలుసా హోటల్‌ బిల్‌. అవును స్నేహితులకు పార్టీ ఇచ్చిన రకుల్‌ కు హోటల్‌ వారు బిల్లు రూపంలో రకుల్‌ కు మైండ్‌ బ్లోయింగ్‌ షాక్‌ ఇచ్చారట. అసలు విషయం ఏంటీ అంటే ఇటీవల లండన్‌ వెళ్లిన సమయంలో రకుల్‌ తన 10 మంది స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు ఒక స్టార్‌ హోటల్‌ కు వెళ్లిందట. అక్కడ కేవలం రకుల్‌ స్నేహితులతో కలిసి వింధు మాత్రమే చేసిందట.

స్నేహితులతో కలిసి ఆమె చేసిన వింధు భోజనానికి హోటల్‌ వారు వేసిన బిల్లు 10 లక్షల రూపాయలట. అక్షరాల పదిలక్షల రూపాయల బిల్లు చూసి ఆమె కళ్లు తిరిగినంత పనైందట. చేసేదేమి లేక ఆ బిల్లు కట్టి బయటకు వచ్చేసిందట. అంత భారీ మొత్తంలో బిల్లు అవుతుందని తాము ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ గా సినిమాకు కోటి వరకు సంపాదిస్తున్న రకుల్‌ కు పది లక్షల బిల్లు లెక్క ఏం కాదు. కాని 10 మంది స్నేహితులకే పార్టీ ఇస్తే అది కూడా కేవలం వింధు వరకే అయినా అంత బిల్లు రావడం ఆమెకు షాకింగ్‌ గా అనిపించిందట.

ఇక ఈమె సినీ కెరీర్‌ విషయానికి వస్తే తమిళనాట వరుసగా చిత్రాలు చేస్తోంది. ఇటీవలే ఈమె 'దేవ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే సూర్యతో కలిసి కూడా మరో సినిమాతో రాబోతుంది. తమిళం మరియు హిందీల్లో కలిపి అరడజను సినిమాల వరకు చేస్తున్న ఈ అమ్మడు తెలుగులో మాత్రం పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. ఈమద్యే బాలయ్యకు జోడీగా బోయపాటి మూవీలో ఎంపిక అయ్యిందని వార్తలు వస్తున్నాయి.