Begin typing your search above and press return to search.

నేను బికినీ వేసుకుంటే నాకంటే మా పేరెంట్స్ కంఫర్టబుల్‌ గా ఫీల్ అవుతారు

By:  Tupaki Desk   |   8 May 2020 6:00 AM IST
నేను బికినీ వేసుకుంటే నాకంటే మా పేరెంట్స్ కంఫర్టబుల్‌ గా ఫీల్ అవుతారు
X
రకుల్ ప్రీత్ సింగ్... తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌ గా ఎదిగిందని చెప్పవచ్చు. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తన నటనతో విమర్శకులను సైతం మెప్పించి యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న బ్యూటీ రకుల్. వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉండే రకుల్ కు ఇటీవల అవకాశాలు తగ్గాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య ఒక ప్రముఖ మీడియాకి తన తల్లి రీనీసింగ్ తో కలిసి మొదటిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో లైఫ్ గురించి.. లవ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. తనకి అమ్మ ఎంతగా సపోర్ట్ చేస్తుందో చెప్పుకొచ్చింది.

తన లైఫ్ కి సంబంధించి నాకు ఏమి కావాలో నాకంటే మా అమ్మకి బాగా తెలుసని.. ఆమె నాకు ఎప్పుడు ఒక పిల్లర్ లా నిలబడుతుందని చెప్పింది. అందుకే 'అమ్మే నాకు కొండంత బలం' అంటుంది రకుల్. నేను హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేయకముందే మిస్ ఇండియా కాంపిటేషన్ కి వెళ్లానని.. దానికోసం అమ్మ ఎంతగానో సపోర్ట్ చేసిందని తెలిపింది. ఆనాడు మిస్ ఇండియా పోటీలకు వెళ్తున్నప్పుడు తనమీద తనకే నమ్మకం లేదు. కానీ అమ్మ మీద మాత్రం బోలెడు నమ్మకం. మిస్ ఇండియా.. తనకు అంత సీనుందా అని అమ్మ ఎప్పుడూ అనుకోలేదు. అంతేకాకుండా ''మిస్ ఇండియా పోటీలంటే ఆశామాషీ కాదు. అందులో బికినీ రౌండ్ కూడా ఒకటి ఉంటుంది. నేను దానికి సిద్ధంగా లేను.. కానీ అమ్మ దీనిలో తప్పేముంది.. బికినీ ధరించడానికి సిద్ధంగా ఉండమని.. నువ్వు చేయగలవు అని కాన్ఫిడెన్స్ నింపింది'' అని చెప్పుకొచ్చింది.

నిజానికి బికినీ అంటే నాకు బెరుకు ఉండేది.. కానీ నాకంటే మా అమ్మానాన్నే నేను బికినీ ధరిస్తే కంఫర్టబుల్‌ గా ఫీల్ అవుతారు అని రకుల్ చెప్పింది. అంతేకాకుండా మిస్ ఇండియా పోటీల దుస్తులు కూడా అమ్మే షాపింగ్‌ కు తీసుకువెళ్లి స్వయంగా కొనిపెట్టింది. చాలా మంది పిల్లలకి ఇలాంటి వాటిలో పేరెంట్స్ సపోర్ట్ ఉండదు.. కానీ మా పేరెంట్స్ మాత్రం సపోర్టివ్ గా ఉంటారు.. ఇంకా చెప్పాలంటే మా నాన్న డల్ గా ఉండే రంగుల బికినీలు వద్దు వైబ్రంట్ కలర్స్ అయితే బికినీలు బాగుంటాయని చెప్పి ఎంకరేజ్ చేసారని రకుల్ తెలిపింది. మాది ఆర్మీ ఫ్యామిలీ. అన్ని విషయాలూ నిర్మొహమాటంగా చర్చించుకుంటాం. లవ్ లైఫ్ గురించి.. అబ్బాయిల గురించి అమ్మ నన్ను టీజ్ చేస్తుంది అని రకుల్ చెప్పింది. మా అమ్మ నా కోసం నా తమ్ముడి కోసం తన లైఫ్ మొత్తం త్యాగం చేసింది. మేము చదివే స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయ్యేది. కానీ నాన్నకి ఎప్పుడు ట్రాన్సఫర్ అయితే అప్పుడు మాతో పాటు ఆ జాబ్ వదిలేసి మా కోసం వచ్చేసేది అంటూ చెప్పుకొచ్చింది. నేను హీరోయిన్ అయిన తర్వాత నాన్న జాబ్ వదిలేసి మాతో టైం స్పెండ్ చేస్తున్నాడని చెప్పింది.

ఇక సినిమాల విషయానికొస్తే రకుల్ ప్రీత్ సింగ్ 2019 తెలుగులో ఒక్క సినిమాలోనే నటించినప్పటికీ.. హిందీ, తమిళంలో మాత్రం పలు చిత్రాలను చేసింది. వీటిలో చాలా వరకు హిట్లుగా నిలిచాయి. అజయ్ దేవగన్ సరసన 'దే దే ప్యార్ దే' మరియు 'మార్జావాన్' సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించింది. ప్రస్తుతం జాన్ అబ్రహం తో కలిసి 'ఎటాక్' మరియు అర్జున్ కపూర్ తో ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమాలో కూడా నటిస్తోందని సమాచారం.