Begin typing your search above and press return to search.
రకుల్ కార్తీక మాసం కోసం వెయిటింగ్!
By: Tupaki Desk | 13 Oct 2021 7:00 AM ISTఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కొత్త పెళ్లికూతురు అవుతోంది. బాలీవుడ్ నిర్మాత-నటుడు జాకీ భగ్నాని ప్రేమలో ఉన్నానని ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రకుల్ మొత్తం కెరీర్ లో పెద్దగా రూమర్లకు ఆస్కారం లేకున్నా.. ఆ ఒక్క విషయంలో ఎక్కడో చిన్న వెలితి కనిపించేది. తాజాగా యువహీరో జాకీ ప్రేమతో అన్ని సెట్ అయినట్లే కనిపిస్తోంది. ముందుంది అసలైన ఘట్టం. దానికి ముందే బోలెడంత ప్రిపరేషన్ కి రకుల్ రెడీ అవుతోంది.
చేతిలో ఉన్న సినిమాలన్నింటిని చకచకా పూర్తి చేసి ఫ్రీ అయిపోవాలని రకుల్ ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా దర్శక నిర్మాతల్ని తన పాత్ర షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయమని రెక్వెస్ట్ చేస్తోందిట. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయనప్పటికీ బాలీవుడ్ లో కొంచెం బిజీగానే ఉంది. ఈ నేపథ్యంలో సెట్స్ లో ఉన్నసినిమాలు వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంది. మరి ఇప్పుడే ప్రేమ విషయం వెల్లడించింది.
అప్పుడే అంత స్పీడ్ ఎందుకంటే? ఆసక్తికర సంగతి బయటకొచ్చింది. వీలైనంత త్వరగా జాకీతో మూడు ముళ్లు వేయించుకుని దాంపత్య జీవితాన్ని ఆస్వాధించాలని భావిస్తోందిట. కుటుంబ సభ్యులు కూడా ఆ రకంగా ఒత్తిడి తీసుకురావడంతో ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఏడు అడుగులు వేయడమే మంచిదని రకుల్ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే నిజమైతే వచ్చేది కార్తీకమాసం. పెళ్లిళ్లకు అన్ని మంచి రోజులే. కాబట్టి రకుల్ వెడ్డింగ్ కి ధూమ్ ధామ్ బ్యాండుమేళం సిద్ధం చేసే సమయం దగ్గరపడినట్లే. రకుల్- వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.