Begin typing your search above and press return to search.
రకుల్ నిక్కరు ఫోజు అదిరెనులే
By: Tupaki Desk | 16 March 2020 10:49 AM ISTవరుస ఫ్లాపులు టాలీవుడ్ అంటేనే మొహం మొత్తేసేలా చేశాయి. స్పైడర్ మొదలు మొన్న మన్మథుడు 2 వరకూ పలు పరాజయాలు బాగా కుంగదీశాయి రకుల్ ని. అందుకేనేమో.. ఇటీవలి కాలంలో హైదరాబాద్ పరిసరాల్లో సరిగా కనిపించడం లేదు. ఎప్పుడు చూసినా ముంబైలో ఏదో ఒక ఫోటోషూట్ అంటూనే.. ఫ్యాషన్ వీక్ అంటూనో అక్కడే సెటిలైపోయింది.
పనిలో పనిగా హిందీ చిత్రసీమలో అవకాశాల కోసం అర్రులు చాస్తోంది. ఇప్పటివరకూ వరసగా వెంటపడి అవకాశాలు రాకపోయినా .. ప్రస్తుతానికి ఓ బాలీవుడ్ సినిమాలో అయితే నటిస్తోంది. సౌత్ లో భారతీయుడు 2 మినహా వేరొక ఛాన్స్ అయితే రాలేదు. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా వీలున్నప్పుడల్లా వీధుల్లో తన షికారుకు సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియా లో వైరల్ చేస్తోంది. అక్కడ నిరంతరం అభిమానులకు టచ్ లో ఉంటోంది.
తాజా ఫోటోలో రకుల్ ఎంతో క్యాజువల్ గా కనిపిస్తోంది. పైన పింక్ టాప్.. బాటమ్ లో డెనిమ్స్ చినుగుల నిక్కరు.. కాంబినేషన్ అదిరింది. బాటమ్ ఎంత పొట్టిగా ఉంటే అంతగా థై సొగసులు ఎలివేట్ అయ్యి యూత్ ని గిలిగింతలు పెట్టేస్తాయనే ప్రాథమిక సూత్రాన్ని ఫాలో చేస్తోంది ఈ అమ్మడు. కనీసం తనని ఇలా క్యాజువల్ లుక్ లో చూశాక అయినా ఇటు సౌత్ దర్శకనిర్మాతల నుంచి పిలుపు అందుతుందేమోనన్న ఆశ కాబోలు. కానీ ఏం లాభం ఇప్పట్లో రకుల్ గురించి ఇక్కడ ఎవరూ ఆలోచించే పరిస్థితి లేనేలేదు. అన్నట్టు ఆ పింక్ టాప్ పై అన్ స్టాపబుల్ అనే క్యాప్షన్ ఉంది. తనని ఎవరూ ఆపలేరు అనేనా దీనర్థం. అయినా ఎవరూ ఆపాల్సిన పనే లేకుండా కెరీర్ పరంగా తనకు తానే బ్రేకులు వేసేసుకుందిగా!!