Begin typing your search above and press return to search.

#కోవిడ్ నుంచి కోలుకుని ర‌కుల్ సేఫ్‌.. ఇక షూటింగేలేనా?

By:  Tupaki Desk   |   30 Dec 2020 2:30 AM GMT
#కోవిడ్ నుంచి కోలుకుని ర‌కుల్ సేఫ్‌.. ఇక షూటింగేలేనా?
X
కోవిడ్ 19 పాజిటివ్ వ‌చ్చిందంటూ బాంబ్ పేల్చిన ర‌కుల్ ప్రీత్ డాక్ట‌ర్ల స‌మ‌క్షంలో చికిత్స పొంది తిరిగి కోలుకున్నారు. ప్ర‌స్తుతం కోవిడ్ నెగెటివ్ అన్న రిపోర్ట్ అందింది. ‘మంచి ఆరోగ్యం సానుకూలతతో 2021 ప్రారంభించడానికి వేచి ఉండలేను’ అంటూ ర‌కుల్ ఆనందం వ్య‌క్తం చేస్తూ ఈ విష‌యాన్ని ఇన్ స్టా మాధ్య‌మంగా వెల్ల‌డించింది.

రకుల్ ప్రీత్ సింగ్ తన కోవిడ్ -19 నిర్ధారణ అయ్యాక వారంలోనే కోలుకున్నట్లు తన అభిమానులకు శ్రేయోభిలాషులకు తెలియజేయడానికి ఇన్ ‌స్టాలోకి వెళ్లింది. నేను పూర్తిగా బాగున్నాను. మీ ప్రార్థ‌న‌లు ప్రేమకు ధన్యవాదాలు అని తెలిపింది. బాధ్యత వహించండి.. మాస్కులు ధరించండి .. అన్ని జాగ్రత్తలు తీసుకోండి ” అని ర‌కుల్ అభిమానుల‌కు సూచించింది.

రకుల్ ఇటీవల తన కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో విహ‌రించిన సంగ‌తి తెలిసిందే. విహారయాత్ర నుంచి ర‌క‌ర‌కాల బికినీ ఫోటోల్ని షేర్ చేయ‌గా అవి అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఫ్లైబోర్డ్ ప్లే.. డీప్ సీ డైవింగ్ వంటి సాహసాలను ఆస్వాధిస్తూ కనిపించింది. అనంత‌రం దేవ‌గ‌న్ మేడే షూటింగులో పాల్గొన‌గా ఆ త‌ర్వాత కోవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది.

కెరీర్ సంగ‌తి చూస్తే.. రకుల్ ఇటీవలే అజయ్ దేవ్‌గన్ దర్శకత్వం వహించిన `మేడే` చిత్రీక‌ర‌ణలో పాల్గొంది. ఇందులో ర‌కుల్ పైలట్ పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న `కొండ‌పొలం` చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసింది. లక్ష్మీరాజ్ ఆనంద్ `దాడి`.. కాశ్వి నాయర్ సరిహద్దు రొమాంటిక్ డ్రామా సర్దార్ అండ్ గ్రాండ్ స‌న్ వంటి ఇత‌ర ప్రాజెక్టులు కూడా రకుల్ లైన‌ప్ లో ఉన్నాయి.