Begin typing your search above and press return to search.

వీడియో: ఆన్ లొకేష‌న్ ర‌కుల్ రంగుల పండుగ మ‌స్త్ మ‌జాక్

By:  Tupaki Desk   |   29 March 2021 5:57 AM GMT
వీడియో: ఆన్ లొకేష‌న్ ర‌కుల్ రంగుల పండుగ మ‌స్త్ మ‌జాక్
X
దేశ‌వ్యాప్తంగా రంగుల పండ‌గ వైభ‌వం క‌నిపిస్తోంది. ఇక బాలీవుడ్ టు టాలీవుడ్ హోలీ సెల‌బ్రేష‌న్స్ పీక్స్ లోనే ఉన్నాయ‌నేందుకు సోష‌ల్ మీడియా ఫోటోలు వీడియోలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇండ‌స్ట్రీ టాప్ సెల‌బ్రిటీలంతా హోలీని ఘ‌నంగా జ‌రుపుకున్నారు.

తాజాగా స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఓ వీడియో అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. రంగుల పండుగ అంటే ఈ పంజాబీ బ్యూటీ ఇంట్లో బోలెడంత సంద‌డి ఉంటుంది. అయితే ర‌కుల్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంటోంది కాబ‌ట్టి ఈసారి కుటుంబ స‌భ్యుల‌తో హోలీ కుద‌ర‌లేదు. అందుకే ఇదిగో ఇలా ఆన్ లొకేష‌న్ ఈ సెల‌బ్రేష‌న్ జ‌రుపుకున్నార‌ని ఈ వీడియో చెబుతోంది.

హ్యాపీ హ్యాపీ హోలీ.. ఈ రంగుల పండుగ బోలెంత పాజిటివిటీని నింపాలి! అంటూ ర‌కుల్ త‌న అభిమానుల‌కు విష్ చేసారు. ర‌కుల్ షేర్ చేసిన సెల‌బ్రేష‌న్ వీడియో అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ర‌కుల్ ఇంత‌కుముందే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో షూటింగ్ పూర్తి చేసుకుని బాలీవుడ్ సినిమా మేడే సెట్స్ కి వెళ్లారు. దాంతో పాటే ప‌లు భారీ చిత్రాల్లోనూ న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిన‌దే.