Begin typing your search above and press return to search.

మన్మథుడి లవర్ ని అందుకే దాచారు

By:  Tupaki Desk   |   15 Jun 2019 10:53 AM IST
మన్మథుడి లవర్ ని అందుకే దాచారు
X
మొన్న విడుదలైన మన్మథుడు 2 టీజర్ మంచి ట్రెండింగ్ లో ఉంది. ఆరు పదుల వయసులోనూ కొడుకులతో పోటీ పడే లెవెల్ లో గ్లామర్ మైంటైన్ చేస్తున్న నాగ్ ని చూసి షాక్ తిన్న వాళ్ళే ఎక్కువ. రావు రమేష్ లక్ష్మి వెన్నెల కిషోర్ లాంటి కీలకమైన ఆర్టిస్టులందరినీ టీజర్ లో చూపించారు కాని అసలైన హీరొయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని మాత్రం దాచేశారు. పాపం ఈ విషయంగా ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు కూడా. కాని దాని వెనుక ప్రత్యేకమైన కారణం ఉందంటున్నాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.

రకుల్ చేసిన అవంతిక పాత్రను ప్రత్యేకంగా ఇంట్రోడ్యుస్ చేస్తూ మరో టీజర్ వదులుతారట. సినిమాలో తనకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో ప్రేక్షకులకు తెలియాలనే ఉద్దేశంతోనే ఇది ప్లాన్ చేసినట్టు చెబుతున్నాడు. ఇది ఓకే కాని మరీ ఓ టీజర్ వదిలేంత రేంజ్ లో తన పాత్ర ఏముందనే అనుమానం రాకమానదు. మూడేళ్ళ క్రితమే నాగ చైతన్యతో నటించిన రకుల్ ఇప్పుడు చైతు డాడీ నాగ్ తో ఇంత తక్కువ టైంలో హీరొయిన్ చేయడం విశేషమే.

హిందిలో అజయ్ దేవగన్ తెలుగులో ఇప్పుడు నాగార్జున ఇలా హాఫ్ సెంచరీ హీరోలకు ఓకే చెప్తున్న రకుల్ ఇకపై కూడా అలాంటి ఆఫర్స్ వస్తాయేమో అని ఆలోచించడం లేదు. స్టార్ హీరోల సరసన కాబట్టి వయసులో తాను వాళ్ళ కన్నా ఎంత చిన్న అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. మొత్తానికి రకుల్ మన్మధుడు 2లో మాములు అల్లరి చేయలేదని అర్థమవుతోంది. కాని కొత్త టీజర్ కోసం ఈ నెలాఖరుదాకా వెయిట్ చేయాల్సిందే