Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: స్కై డైవ్ కు రకుల్ రెడీ

By:  Tupaki Desk   |   7 Feb 2019 11:29 AM GMT
ఫోటో స్టొరీ: స్కై డైవ్ కు రకుల్ రెడీ
X
ఈ జెనరేషన్ టాలీవుడ్ బ్యూటీలు జస్ట్ అందంగా కనిపించడమే కాదు.. చాలా ధైర్యంగా ఉంటారు. సినిమాల్లో తమపాత్ర కోసం కఠినమైన స్టంట్స్ చేసేందుకు కూడా రెడీ అవుతారు. స్టంట్స్ అంటే జస్ట్ ఫైట్ సీన్స్ లో ఉండే స్టంట్స్ లాంటివి మాత్రమే కాదు.. బంగీ జంప్ లాంటివి కూడా చేసేస్తారు. కానీ రకుల్ మాత్రం ఇంకో అడుగు ముందుకేసినట్టుంది.

ఎందుకంటారా? కాసేపటి క్రితం టాలీవుడ్ స్టైలిస్ట్ నీరజ కోన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో రకుల్ తో కలిసి నీరజ పోజిచ్చారు. ఈ ఫోటోకు 'జంపీ అండ్ జంపర్ #రకుల్ ప్రీత్ #దుబాయ్ స్కై డైవ్' అనే క్యాప్షన్ ఇచ్చారు. స్టోరీ ఏంటో అర్థం అయిందా? ఎప్ప్డుడైనా దుబాయ్ స్కై డైవ్ గురించి విన్నారా? ఇదో అడ్వెంచర్ స్టంట్. 13,000 అడుగుల ఎత్తు నుండి నేల మీదకు జంప్ చేయాలి.. అంతే.. సింపుల్. ఒక ఏరోప్లేన్ లో మనల్ని ఆకాశంలోకి తీసుకెళతారు.. అక్కడ ఒక ప్రొఫెషనల్ మనతో పాటు జంప్ చేస్తారు.. అఫ్ కోర్స్..ఆ ప్రొఫెషనల్ కు మనకు కలిపి ప్యారాచూట్ కూడా ఉంటుంది. ఎంత సేఫ్టీ మెజర్స్ ఉన్నా.. ఆ హైట్ నుండి దూకితే గుండె లబ్ డబ్ మని రెగ్యులర్ గా కాకుండా లబోదిబోమని గజిబిజిగా కొట్టుకోవడం ఖాయమే.

మరి రకుల్.. నీరజ లు అక్కడ స్కై డైవ్ చేశారా లేదా అనేది మాత్రం వెల్లడించలేదు. 'జంపీ జంపర్' క్యాప్షన్ ను బట్టి మనం వాళ్ళు ఆ స్కై డైవ్ చేశారని మనం ఫిక్స్ అయిపోవచ్చు.. ఇదిలా ఉంటే.. నీరజ ఈ ఫోటో పోస్ట్ చేసిన మరో గంట తర్వాత రకుల్ తన ఇన్స్టా ఖాతా ద్వారా మరో ఫోటో పోస్ట్ చేసింది గానీ ఈ స్కై డైవ్ గురించి మాత్రం ఏ ఇన్ఫో ఇవ్వలేదు. #దుబాయ్ షూట్ డైరీస్ అనే హ్యాష్ ట్యాగ్ మాత్రం ఇచ్చింది. మరి ఈ స్టంట్ ఏదైనా సినిమా కోసం చేసిందేమో ఈ రకులు ప్రీతు సింగు!