Begin typing your search above and press return to search.

ర‌కుల్ డేరింగ్ స్టెప్‌.. వాటికీ సై అంటూ ఓపెన్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   1 Feb 2022 7:00 AM IST
ర‌కుల్ డేరింగ్ స్టెప్‌.. వాటికీ సై అంటూ ఓపెన్ కామెంట్స్‌!
X
`గిల్లి` అనే క‌న్న‌డ చిత్రంతో సినీ రంగ‌ప్ర‌వేశం చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. 2011లో `కెర‌టం`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలీదు. అయితే ఆ త‌ర్వాత ఈమె న‌టించిన `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` ప్రేక్ష‌కులకు బాగానే రీచ్ అయింది. ఈ మూవీలో ప్రార్ధనగా అంద‌రి మ‌న‌సు దోచేసిన ర‌కుల్‌.. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్ ఇండ‌స్ట్రీల్లోనూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

ప్ర‌స్తుతం ఈ ఢిల్లీ భామకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. కానీ, హిందీలో మాత్రం అర‌డ‌జ‌న్‌కు పైగా చిత్రాలు చేస్తూ మ‌స్తు బిజీగా గ‌డుపుతోంది. అలాగే మ‌రోవైపు బాలీవుడ్ న‌టుడు, నిర్మాత‌ జాకీ భ‌గ్నానీతో ప్రేమాయ‌ణాన్ని సైతం న‌డిపిస్తోంది. ఇక‌పోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఓ డేరింగ్ స్టెప్ వేసింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. క‌రోనా ఎఫెక్ట్‌తో ఓటీటీ హ‌హా బాగా పెరిగిపోయింది. దీంతో స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఓటీటీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే స‌మంత‌, కాజ‌ల్, శ్రుతి హాస‌న్‌, త‌మ‌న్నా వంటి స్టార్ హీరోయిన్లు ఓటీటీ వేదిక‌గా త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. అయితే త్వ‌ర‌లోనే ర‌కుల్ సైతం డిజిట‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. వెబ్ సిరీస్‌, టాక్ షోలు చేయ‌డానికి సై అంటూ తాజాగా ర‌కుల్‌ ఓపెన్ కామెంట్స్ కూడా చేసింది.

ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌కుల్‌.. ఓటీటీల‌పై ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. `ఇటీవ‌ల కాలంలో ఓటీటీల‌కు ప్ర‌జ‌ల్లో ప్రాధాన్య‌త పెరుగుతుంది. ముఖ్యంగా ఓటీటీల కార‌ణంగా రీజ‌న‌ల్ సినిమాలు, కంటెంట్ అనేది ఎక్కువ మందికి చేరువ అవుతుంది. దీంతో సినిమాల మధ్య ఉన్న భాషా పరమైన హద్దులు చెరిగిపోయాయి. ఇక ఓటీటీల్లో షో లేదా వెబ్‌సిరీస్‌లు చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ స్టోరీ నన్ను ఎగ్జైట్‌ చేయడంతో పాటు నా పాత్ర కథను నడిపించే లా ఉండాలి` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.